Silver peacock: ఇంట్లో ఆ ప్రదేశంలో వెండి నెమలిని పెట్టుకోండి చాలు, లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపిస్తుంది..!
ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తు అత్యంత ప్రముఖ్యతను కలిగి ఉంటుంది. ఇంటిల్లిపాదికి లాభనష్టాలు, సుఖ సంతోషాలు ఈ వాస్తు మీదనే ఆధారపడి ఉంటాయని నమ్ముతారు. ఇంటికి సానుకూల శక్తి, శ్రేయస్సును పెంచడానికి వాస్తు శాస్త్రంలో అనేక నివారణలు సూచించబడ్డాయి. వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో ధన ప్రవాహంతోపాటు సానుకూల శక్తిని తెస్తుందని విశ్వాసం. అయితే, ఇంట్లో వెండి నెమలి బొమ్మ ఉంటే ఎలాంటి ఫలతాలు ఉంటాయి.. దానిని ఏ దిశగా ఉంచాలో ఇక్కడ చూద్దాం..

ఈ శక్తివంతమైన నివారణలలో ఒకటి వెండి నెమలి. ఇది వాస్తు దోషాన్ని తొలగించడమే కాకుండా, లక్ష్మీ దేవి ఆశీర్వాదాలను కూడా ఆకర్షిస్తుంది. వెండి నెమలిని వాస్తు శాస్త్రంలో శుభ చిహ్నంగా పరిగణిస్తారు. ఇది శ్రేయస్సు, శక్తిని సూచించే శ్రీమహా లక్ష్మీ, ఆ కార్తికేయతో ముడిపడి ఉంది. అందుకే ఇంట్లో వెండి నెమలి ప్రతికూల శక్తిని తొలగించి ఇంట్లో సానుకూలతను వ్యాపింపజేస్తుంది. సరైన స్థలంలో ఉంచడం వల్ల వాస్తు దోషం తగ్గుతుంది. సంపద, ఆనందం, శాంతిని ఆకర్షిస్తుంది.
అంతేకాదు..వెండి నెమలి శుక్ర గ్రహం, చంద్రునికి సంబంధించినది. కాబట్టి శుక్రుడు ప్రేమ, ఐశ్వర్యం, శ్రేయస్సుకు కారకుడుగా చెబుతారు. అలాగే, చంద్రుడు మనశ్శాంతిని పెంచుతాడు. అందుకే ఇంట్లో వెండి నెమలి ఉంచడం వల్ల ఇంటికి అందం, అదృష్టాన్ని తెస్తుంది.. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి దీనిని పూజా స్థలంలో లేదా ఇంట్లో ఒక ప్రముఖ ప్రదేశంలో ఉంచుతారు. ఇది కుటుంబంలో సామరస్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందిస్తుందని కూడా వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం, వెండి నెమలి విగ్రహాన్ని ఈశాన్యం వైపు ఉంచడం మంచిది. ఈ దిశ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దిశలో వెండి నెమలిని ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి శ్రేయస్సుని తీసుకు వస్తుంది. సంపద పెరుగుదలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నెమలి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు నెమలి నృత్యం చేస్తునట్టు లేదా కదిలే స్థితిలో ఉండే విగ్రహాన్ని కొనుగోలు చేస్తే మంచిది. ఇది సానుకూల శక్తిని తీసుకువస్తుంది. ఇది వాస్తు దోషాన్ని తగ్గిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది.
వెండి నెమలిని ఉంచుకోవడంతో పాటు, సానుకూల జీవనశైలిని అలవర్చుకోవడం కూడా ముఖ్యం. సాత్విక ఆహారం, క్రమం తప్పకుండా పూజలు చేయడం మరియు ఇంట్లో పరిశుభ్రత పాటించండి. వెండి నెమలిని పూజా స్థలంలో ఉంచి ప్రతిరోజూ దీపం వెలిగించి లక్ష్మీదేవి మంత్రాలను జపించండి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం తొలగిపోవడమే కాకుండా, ఇంట్లో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు పెరుగుతుంది.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








