Whatsapp: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో అద్బుత ఫీచర్..
ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా మరో కొత్త ఫీచర్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. వాట్సప్‌లో వీడియోలు, ఫొటోలు ఇక సులువుగా దీని ద్వారా పంపుకోవచ్చు. ఆ ఫీచర్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

వాట్సప్.. ఈ యాప్ వాడని స్మార్ట్‌ఫోన్ యూజర్లు అంటూ ఎవరూ ఉండరు. ఎన్నో మెస్సేజింగ్ యాప్‌లు ఉన్నా.. పాపులర్ కావడంతో అందరూ వాట్సప్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే తమ యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ఎప్పుడూ ఏదోక ఫీచర్‌తో యూజర్లను థ్రిల్‌కు గురి చేస్తోంది. ఇటీవల వీడియో, వాయిస్ నోట్ వంటి ఫీచర్లను లాంచ్ చేసిన వాట్సప్.. కొద్దిరోజుల్లోనే మరో కొత్త ఫీచర్‌ను రీలీజ్ చేసేందుకు రెడీ అయింది. ఇంతకు ఈ ఫీచర్ల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గ్యాలరీతో సంబంధం లేకుండా..
ఇప్పటివరకు మనం వాట్సప్‌లో ఎవరికైనా ఫొటోలు లేదా వీడియోలు పంపాలంటే అవి మన ఫోన్ గ్యాలరీలో సేవ్ అయి ఉండాల్సి వచ్చేంది. గ్యాలరీలో ఉన్నవాటిని మనం వాట్సప్‌లో షేర్ చేసుకునే సౌకర్యం ఉండేది. కానీ గ్యాలరీతో సంబంధం లేకుండా నేరుగా వాట్సప్ నుంచే ఇతరులకు వీడియోలు, ఫొటోలు పంపుకునే ఫీచర్‌ను వాట్సప్ తీసుకొస్తుంది. ఆండ్రాయిడ్ 2.25.37.4 వెర్షన్ వాట్సప్‌లో ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
గ్యాలరీ ఇంటర్‌ఫేస్
వాట్సప్ చాట్ విండోలో అటాచ్‌మెంట్ మెనూలో కెమెరా పక్కన గ్యాలరీ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. మీరు రీసెంట్‌గా క్లిక్ చేసిన ఫొటోలు, వీడియోలు అక్కడ కనిపిస్తాయి. వాటిని ట్యాప్ చేసి మీరు ఇతరులకు పంపవచ్చు. ఇంతకముందులా గ్యాలరీ ఓపెన్ చేసి పంపాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం బీటా టెస్టింగ్ జరుగుతుండగా.. ఫిబ్రవరిలో రెగ్యూలర్ యూజర్లకు అందుబాటులో రానుందని తెలుస్తోంది.
వీడియో, వాయిస్ నోట్
ఇటీవల వాట్సప్ వీడియో, వాయిస్ నోట్ ఫీచర్లను తీసుకొచ్చింది. మీరు ఎవరికైనా వాట్సప్‌లో వీడియో లేదా వాయిస్ కాల్ చేసినప్పుడు వారు లిప్ట్ చేయకపోతే అక్కడే వీడియో, వాయిస్ నోట్ పంపించవచ్చు. అలాగే వాట్సప్ స్టేటస్‌లో మరిని స్కికర్లను జోడించింది. ఈ ఫీచర్లు ఇప్పటికే అందరికీ అందుబాటులోకి వచ్చాయి.




