Jio Offers: జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. న్యూ ఇయర్ వేళ బంపర్ ఆఫర్లు
ఇండియాలోనే నెంబర్ వన్ టెలికాం సంస్థగా ఉన్న జియో తన కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. న్యూ ఇయర్ సందర్భంగా కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా వీటిల్లో లభిస్తుంది. ఈ ప్లాన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం

కొత్త సంవత్సరం వస్తుండటంతో కంపెనీలన్నీ కస్టమర్లను ఆకట్టుకునుందుకు అనేక ప్లాన్లు తీసుకొస్తున్నాయి. అందులో భాగంగా జియో మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ. 103 ఫ్లెక్సీ ప్యాక్ డేటా యాడ్-ఆన్, రూ. 500 సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్, రూ. 3599 హీరో రీఛార్జ్ వార్షిక ప్లాన్లను కొత్తగా ప్రవేశపెట్టింది. హ్యాపీ న్యూ ఇయర్ 2026 పేరుతో వీటిని తీసుకొచ్చింది. మిగతా టెలికాం సంస్థలు కూడా కొత్త సంత్సరం సందర్బంగా ఆఫర్లు ప్రవేశపెడుతున్నాయి. దీంతో జియో కూడా వాటికి పోటీగా తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
రూ. 3599 హీరో రీఛార్జ్ వార్షిక ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. రోజుకు 2.5జీబీ డేటా వస్తుంది. రోజుకు 100 ఫ్రీ ఎస్‌ఎమ్‌ఎస్‌లు, ఆన్ లిమిటెడ్ కాలింగ్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఇక రూ.35 వేలు విలువ చేసే గూగుల్ జెమినీ ప్రొ ఏఐ వెర్షన్‌ను ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు.
రూ.500 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. రోజుకు 2జీబీ డేటా వస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. ఇక అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంది. ఇక 18 నెలల గూగుల్ జెమినీ ప్రొ, జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, సోనీ లైవ్, జీ5 వంటికి ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు.
రూ.103 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. మొత్తం 5జీబీ డేటా లభిస్తుంది. జియో హాట్ స్టార్, జీ5, సోనీ లైవ్ ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు.




