Best Home Theaters: ఇంట్లోనే థియేటర్ అనుభవం.. రిచ్ సౌండ్.. స్టన్నింగ్ ఫీచర్స్..
ఇటీవల వస్తున్న హోమ్ థియేటర్స్ లో అత్యాధునిక ఫీచర్లు ఉంటున్నాయి. వైర్ లెస్ కనెక్టివిటీతో పాటు గూగుల్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. ఈ క్రమంలో వీటిని ఆదరణ కూడా మరింత పెరుగుతోంది. అయితే వీటి ధరలు కూడా కాస్త ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే మీకు రూ. 15,000లోపు ధరలో లభ్యమయ్యే రిచ్, సరౌండ్ సౌండ్‌ని అందించే 5.1 లేదా 7.1 ఛానెల్‌ల వంటి విభిన్న కాన్ఫిగరేషన్‌లతో సిస్టమ్‌లను పరిచయం చేస్తున్నాం.

మ్యూజిక్ ను ఎక్కువగా ఇష్టపడే వారు ఇంట్లో తప్పనిసరిగా హోమ్ థియేటర్ సిస్టమ్ ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే కేవలం పాటల కోసమని కాదుగానీ, టీవీలో వీక్షించే ప్రతీది ఒక థియేటర్ అనుభవాన్ని అందించేందుకు ఇవి దోహదపడతాయి. మంచి ఆడియో, పెద్ద స్క్రీన్ పై స్పష్టమైన విజువల్స్ ఉంటే మంచి వీక్షణ అనుభవం మీ సొంతమవుతోంది. పైగా ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫారంలకు అలవాటు పడుతున్న ప్రజలకు ఈ హోమ్ థియేటర్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే గేమింగ్ ఆడే వారికి కూడా మంచి ఎఫెక్ట్ లతో సౌండ్ సిస్టమ్ అద్భుతమైన అనుభవాన్నిఈ హోమ్ థియేటర్స్ ఇస్తాయి. ఇదివరకు కాలంలో ఈ హోమ్ థియేటర్స్ లో ప్రత్యేకమైన ఫీచర్లు ఏమి ఉండేవి కాదు. అంతా వైర్డ్ కనెక్షన్స్ ఉండేవి. అయితే ఇటీవల వస్తున్న హోమ్ థియేటర్స్ లో అత్యాధునిక ఫీచర్లు ఉంటున్నాయి. వైర్ లెస్ కనెక్టివిటీతో పాటు గూగుల్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. ఈ క్రమంలో వీటిని ఆదరణ కూడా మరింత పెరుగుతోంది. అయితే వీటి ధరలు కూడా కాస్త ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే మీకు రూ. 15,000లోపు ధరలో లభ్యమయ్యే రిచ్, సరౌండ్ సౌండ్‌ని అందించే 5.1 లేదా 7.1 ఛానెల్‌ల వంటి విభిన్న కాన్ఫిగరేషన్‌లతో సిస్టమ్‌లను పరిచయం చేస్తున్నాం. దీనిలో బ్లూటూత్, యూఎస్బీ, హెచ్డీఎంఐ, ఆక్స్ ఇన్‌పుట్‌ల వంటి కనెక్టివిటీ ఆప్షన్లతో ఉంటాయి. కొన్ని మోడళ్లలో ఎల్ఈడీ డిస్‌ప్లేలు, రేడియో వంటి అదనపు సదుపాయాలు కూడా వస్తాయి.
బ్లాపంక్ట్ ఎస్బీడబ్ల్యూ550 5.1..
ఈ కంపెనీ నుంచి కొత్తగా వచ్చిన హోమ్ థియేటర్ ఇది. 5.1 సౌండ్ బార్ తో పాటు శాటిలైట్ స్పీకర్స్ ఉంటాయి. అలాగే 1300వాట్ల ఆర్ఎంఎస్ 20.32 సెం.మీ. సబ్ పూఫర్, ఒక హెచ్డీఎంఐ పోర్టు, బ్లూటూత్, ఆక్స్, యూఎస్బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది. రిమోట్ ద్వారా ఈ సిస్టమ్ ను సులభంగా ఆపరేట్ చేయొచ్చు. రిచ్ సౌండ్ ను అందిస్తుంది.
గోవో గోసురౌండ్ 970..
ఈ హోమ్ థియేటర్ లో 525 వాట్ల సామర్థ్యంలో సౌండ్‌బార్ ఉంటుంది. డాల్బీ ఆడియోతో 5.1 ఛానల్ సపోర్టు ఉంటుంది 6.5 అంగుళాల సబ్ వూఫర్ శక్తివంతమైన బేస్‌ని అందిస్తుంది. ఆప్టికల్, ఆక్స్, యూఎస్బీ, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. 5 ఈక్వలైజర్ మోడ్‌లతో, ఈ సిస్టమ్ వివిధ సౌండ్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటుంది. స్టైలిష్ రిమోట్, ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది.
పానాసోనిక్ ఎస్సీ-హెచ్టీ550జీడబ్ల్యూ-కే..
ఇది150వాట్ల పవర్‌ని అందించే 5.1 ఛానల్ బ్లూటూత్ హోమ్ థియేటర్ సిస్టమ్. ఇది బ్లూటూత్ లో లీనమయ్యే ఆడియో కనెక్టివిటీని అందిస్తుంది. వేరే పరికరం జత చేయడంలో మంచి సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది. ఇది సొగసైన నలుపు డిజైన్‌తో, ఎక్కడైనా ఇమిడిపోయే స్థలంలో వస్తుంది. దీని కాంపాక్ట్ డిజైన్ తో పాటు నాణ్యమైన ధ్వనిని కోరుకునే వారికి బస్ట్ చాయిస్. విభిన్న ఆడియో మోడ్లు అందుబాటులో ఉంటాయి.
ఒబేజ్ 200వాట్స్..
ఇది 5.1 చానల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ను అందిస్తుంది. 8 అంగుళాల వైర్డ్ సబ్ వూఫర్, హెచ్డీఎంఐ, బ్లూటూత్ వీ5.3 మల్టీ చానల్ వాల్యూమ్ కంట్రోల్ తో వస్తుంది. బహుళ-ఛానల్ వాల్యూమ్ నియంత్రణ వ్యక్తిగతీకరించిన సౌండ్ సెట్టింగ్‌లను అందిస్తుంది. సొగసైన డిజైన్, శక్తివంతమైన పనితీరుతో పాటు, లీనమయ్యే సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.
పానాసోనిక్ ఎస్సీ-హెచ్టీ460జీడబ్ల్యూ-కే..
ఇది 4.1 చానల్ హోమ్ థియేటర్. రిచ్ ఆడియో కోసం 100వాట్ల పవర్‌ని అందిస్తుంది. బ్లూటూత్, యూఎస్బీ, ఆక్స్ కనెక్టివిటీని అందిస్తుంది. ఎల్ఈడీ డిస్ ప్లే వినియోగదారులకు మెరుగైన సౌకర్యాన్ని అదిస్తుంది. అధిక బేస్ తో పాటు రిమోట్ సాయంతో వాల్యూమ్, బాస్ నియంత్రణను ఇస్తుంది. తక్కువ ధరలో బెస్ట్ సౌండ్ క్లారిటీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








