Watch: పూడ్చిపెట్టిన డెడ్‌బాడీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కన్న కొడుకు మృతి చెంది పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. చనిపోయిన కొడుకు డెడ్ బాడీని పూడ్చి పెట్టిన చోట కాపలా పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. కందులవారిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కన్న కొడుకు మృతి చెంది పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. చనిపోయిన కొడుకు డెడ్ బాడీని పూడ్చి పెట్టిన చోట కాపలా పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. కందులవారిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
కందులవారిపల్లిలో వారం రోజుల క్రితం తీవ్ర జ్వరంతో అనారోగ్యానికి గురైన కొడుకు చనిపోగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే కొడుకు మృతదేహాన్ని పాతి పెట్టిన చోటుపై నిఘా పెట్టాల్సి వచ్చింది. ఏకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు తల్లిదండ్రులు. అనారోగ్యంతో గతవారం మృతి చెందిన 6 ఏళ్ల కొడుకును పోగొట్టుకున్న దుఃఖం నుంచి తేరుకోలేకపోతోంది. గ్రామ పొలిమేరలోని శ్మశానంలో ఖననం చేసిన చోటే కాపాలా పెట్టారు కుటుంబ సభ్యులు. మొదటి సంతానం కావడంతో మంత్రగాళ్ళు మృతదేహాన్ని క్షుద్రపూజల కోసం తవ్వి ఎత్తు కెళతారన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. ఆ అనుమానంతోనే కొడుకును పూడ్చిపెట్టిన చోట రూ.1500 ఖర్చు చేసి రోజూ ఇద్దరు వ్యక్తులను స్మశానం దగ్గర కాపలా కూడా ఉంచారు.
అయితే, రోజువారీగా మనుషులను కాపలాగా ఉంచి కూలీల ఖర్చు భరించలేక పోతున్న తల్లిదండ్రులు, ఇప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఖననం చేసిన ప్రదేశంలో సోలార్ ఆధారిత సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. నిరంతర నిఘా ఉంచారు. స్మశానంలో పూడ్చి పెట్టిన కొడుకు డెడ్ బాడీ ని ఎవరూ తవ్వి తీసుకెళ్లకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దీంతో కొడుకును పోగొట్టుకున్న దుఃఖంతో పాటు ఎవరు గుంతను తవ్వి తీసుకెళ్లకుండా తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూసి గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత కష్టం వచ్చిందని బాధపడుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




