Best 32-inch HD TVs: 32 అంగుళాల బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే.. చిన్న గదికి బెస్ట్ ఆప్షన్స్..
చిన్న గదిలో మనకు ఇమిడిపోయే స్మార్ట్ టీవీ కావాలంటే మాత్రం తప్పనిసరిగా 32 అంగుళాలే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కూడా చిన్న గదిలోకి అవసరమయ్యే 32 అంగుళాల టీవీ కోసం ఎదురుచూస్తుంటే ఈ కథనం మీ కోసమే. దీనిలో మార్కెట్లోని బెస్ట్ 32 అంగుళాల హెచ్‌డీ టీవీలను మీకు అందిస్తున్నాం. కేవలం పరిమాణం మాత్రమే కాకుండా డిస్ ప్లే నాణ్యత, డిజైన్, కనెక్టివిటీ, ఫీచర్ల వంటి వాటిల్లోనూ బెస్ట్ ఉన్న వాటిని జాబితా చేశాం.
ప్రస్తుతం స్మార్ట్ హెచ్‌డీ టీవీలు సాధారణం అయిపోయాయి. ప్రతి ఇంట్లోనూ ఓ స్మార్ట్ టీవీ లేదా ఆండ్రాయిడ్ టీవీ ఉండాలని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ ఫారంలు, యూ ట్యూబ్ కూడా వీటిల్లో చూడటానికి అవకాశం ఉండటంతో అందరూ వీటిని కోరుకుంటున్నారు. అయితే మనకు కొంచెం పెద్ద హాలు లేదా లివింగ్ రూం ఉందంటే 43, 50, 55 అంగుళాల టీవీలను కొనుగోలు చేసుకోవచ్చు. కానీ చిన్న గదిలో మనకు ఇమిడిపోయే స్మార్ట్ టీవీ కావాలంటే మాత్రం తప్పనిసరిగా 32 అంగుళాలే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కూడా చిన్న గదిలోకి అవసరమయ్యే 32 అంగుళాల టీవీ కోసం ఎదురుచూస్తుంటే ఈ కథనం మీ కోసమే. దీనిలో మార్కెట్లోని బెస్ట్ 32 అంగుళాల హెచ్‌డీ టీవీలను మీకు అందిస్తున్నాం. కేవలం పరిమాణం మాత్రమే కాకుండా డిస్ ప్లే నాణ్యత, డిజైన్, కనెక్టివిటీ, ఫీచర్ల వంటి వాటిల్లోనూ బెస్ట్ ఉన్న వాటిని జాబితా చేశాం. వాటిల్లో టాప్ బ్రాండ్లు ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం..
శామ్సంగ్ 32 అంగుళాల వండర్‌టైన్‌మెంట్ సిరీస్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ.. ఈ 32-అంగుళాల శామ్‌సంగ్ స్మార్ట్ టీవీ పెద్ద స్క్రీన్ శక్తిని చిన్న, స్టైలిష్ డిజైన్‌గా ప్యాక్ చేస్తుంది. దీని హెచ్‌డీ రెడీ రిజల్యూషన్, ప్యూర్ కలర్ టెక్నాలజీ స్పష్టమైన రంగులు, పదునైన చిత్రాలను అందిస్తుంది. 20వాట్ల స్పీకర్లు ఉంటాయి. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి మీకు ఇష్టమైన అన్ని యాప్ లను దీనిలో ఇన్ స్టాల్ చేసుకొని వినియోగించుకోవచ్చు. హెచ్డీఎంఐ లేదా యూఎస్బీ ద్వారా ఫోన్, టాబ్లెట్, పర్సనల్ కంప్యూటర్ ను కనెక్ట్ చేయొచ్చు. స్మార్ట్ రిమోట్ ఆప్షన్ కూడా ఉంటుంది. స్లిమ్ బెజెల్, గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్ ఆకర్షణీయగా కనిపించేలా చేస్తుంది. ఇది టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. స్క్రీన్ మిర్రరింగ్, ఇన్ బిల్ట్ వైఫై, వాయిస్ అసిస్టెంట్, డాల్బీ డిజిటల్ ప్లస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో దీని ధర రూ. 13,990గా ఉంది.
ఏసర్ 32 అంగుళాల ఐ సిరీస్ హెచ్ డీ రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. దీనిలో హెచ్ డీ రెడీ స్క్రీన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్నుంచి స్ట్రీమింగ్ యాప్స్, గేమింగ్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకొనే వీలుంటుంది. నెట్ ఫ్లిక్స్, స్పాటిఫై వంటి యాప్ లకు యాక్సెస్ అందిస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్ మీ ఫోన్ లేదా టాబ్లెట్ నుంచి కంటెంట్‌ను పెద్ద స్క్రీన్‌కు ప్రసారం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. స్మార్ట్ రిమోట్ మెను, యాప్‌లను నావిగేట్ చేయడంలో ఉపయోగపడుతంది. డ్యూయల్-బ్యాండ్ వైఫై తో మీరు స్ట్రీమింగ్, గేమింగ్ కోసం స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఆస్వాదించవచ్చు. దీనిలో హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు ఉంటాయి. సౌండ్ అవుట్ పుట్ 20 వాట్లు ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్, డాల్డీ ఆడియో వంటి ఫీచర్లు ఉంటాయి. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో దీని ధర రూ. 10,999గా ఉంది.
వీడబ్ల్యూ 32 అంగుళాల ఫ్రేమ్‌లెస్ సిరీస్ హెచ్ డీ రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. ఇది 178-డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ను అందిస్తుంది. 1366×768 హెచ్డీ రిజల్యూషన్ తో క్రిస్టల్ క్లియర్ చిత్రాలను ప్రదర్శిస్తుంది. 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఇస్తుంది. 20-వాట్ స్టీరియో స్పీకర్లు శక్తివంతమైన సౌండ్ అవుట్‌పుట్ అందిస్తాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీ టీవీ స్క్రీన్‌పై బ్రౌజింగ్, గేమింగ్, సోషల్ మీడియాయాప్ లను సులభంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తాయి. యూఎస్బీ, హెచ్డీఎంఐ, వైఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. గూగుల్ అసిస్టెంట్, బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్, డాల్బీ ఆడియో వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో దీని ధర రూ. 7,777గా ఉంది.
వన్ ప్లస్ 32 అంగుళాల వై సిరీస్ హెచ్ డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. ఇది 1366×768 హెచ్ డీ రెడీ రిజల్యూషన్, 60-హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ కాంట్రాస్ట్, నాయిస్ రిడక్షన్ టెక్నాలజీతో స్పష్టమైన చిత్ర నాణ్యతను అందిస్తాయి. 20-వాట్ డాల్బీ ఆడియో అవుట్‌పుట్ అందిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెట్ ఫ్లిక్స్, యూ ట్యూబ్, ప్రైమ్ వీడియో, రెండు హెచ్డీఎంఐ, రెండు యూఎస్బీ పోర్టులు, క్రోమ్ కాస్ట్ సపోర్టు, వన్ ప్లస్ కనెక్ట్ వంటి ఆప్షన్లు ఉంటాయి. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో దీని ధర రూ. 14,999గా ఉంది.
ఎంఐ 32 అంగుళాల ఏ సిరీస్ హెచ్ డీ రెడీ స్మార్ట్ గూగుల్ టీవీ.. ఇది హెచ్ డీ రిజల్యూషన్ తో రేజర్ షార్ప్ క్లారిటీని అందిస్తుంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. యూ ట్యూబ్, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్ ఉంటుంది. వైఫై, బ్లూ టూత్ తో ట్యాబ్లెట్, ఫోన్ లేదా ట్యాబ్లెట్ వంటి వాటిని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ టీవీకి మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు ఉంటాయి. గూగుల్ అసిస్టెంట్, డాల్బీ ఆడియోను అందిస్తుంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో దీని ధర రూ. 12,999గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..