Bluetooth Speakers: పిక్నిక్‌కి వెళ్తున్నారా? అయితే ఈ స్పీకర్లు ట్రై చేయండి.. హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకెళ్లిపోవచ్చు..
ఇటీవల కాలంలో పోర్టబుల్ స్పీకర్ల వినియోగం బాగా పెరిగింది. పార్టీలు, పిక్నిక్లు, ప్రయాణాలు, పండుగల సమయంలో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. చిన్నగా ఉండటంతో పాటు అవసరం మేరకు సౌండ్ కూడా ఇస్తుండటంతో అందరూ వీటిని వినియోగిస్తున్నారు. సాధారణంగా బ్లూటూత్ స్పీకర్లు అనేసరికి చాలా మంది వాటి ధర చాలా ఎక్కువ ఉంటుందని భావిస్తారు. కానీ చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇటీవల కాలంలో పోర్టబుల్ స్పీకర్ల వినియోగం బాగా పెరిగింది. పార్టీలు, పిక్నిక్లు, ప్రయాణాలు, పండుగల సమయంలో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. చిన్నగా ఉండటంతో పాటు అవసరం మేరకు సౌండ్ కూడా ఇస్తుండటంతో అందరూ వీటిని వినియోగిస్తున్నారు. సాధారణంగా బ్లూటూత్ స్పీకర్లు అనేసరికి చాలా మంది వాటి ధర చాలా ఎక్కువ ఉంటుందని భావిస్తారు. వాటిల్లో అత్యాధునిక ఫీచర్లు ఉంటుండంతో భారీ బడ్జెట్ అని ఊహించుకుంటారు. అయితే అతి తక్కువ ధరలోనే టాప్ బ్రాండ్ బ్లూటూత్ స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ రూ. 2000లోపు ధరలోనే కొన్ని బ్లూ టూత్ స్పీకర్లు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
మివీ రోమ్ 2.. ఇది 5వాట్ల సామర్థ్యంతో ఉండే బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్. దీని ధర అమెజాన్లో రూ. 999గా ఉంది. ఇది శక్తివంతమైన సౌండ్ ను అందిస్తుంది. భారీ బేస్ తో కూడిన సౌండ్ ను అందిస్తుంది. దీని కాంపాక్ట్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 2000ఎంఏహెచ్ రీచార్జబుల్ బ్యాటరీతో ఇది వస్తుంది. ఇది మీ పార్టీ మూడ్ ను పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బోట్ స్టోన్ 352 బ్లూటూత్ స్పీకర్.. ఇది 10వాట్ల ఆర్ఎంఎస్ స్టీరియో సౌండ్ తో కూడిన బ్లూటూత్ స్పీకర్. దీని అమోజాన్లో ధర రూ. 1698గా ఉంది. స్టీరియో సౌండ్ క్లారిటీని అందిస్తుంది. ఐపీఎక్స్7 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ తో వస్తుంది. దీనిలో బ్యాటరీని గంటన్నర నుంచి రెండు గంటల పాటు చార్జ్ చేస్తే 60శాతం వాల్యూమ్ తో 12 గంటల వరకూ ప్లే బ్యాక్ టైంని అందిస్తుంది.
జేబీఎల్ గో 2, మైక్ తో కూడిన వైర్ లెస్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్.. ఇది ఐదు గంటల ప్లే టైంతో ఈ పోర్టబుల్ స్పీకర్ వస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 1,999గా ఉంది. అనుకూలమైన ఆడియో సెట్టింగ్ వినియోగిస్తే ఐదు గంటల ప్లే టైం వస్తుంది. ఐపీఎక్స్7 వాటర్ ప్రూఫ్ డిజైన్ ను కలిగి ఉంటుంది. నీటిలో తడిసినా పాడవకుండా ఉంటుంది. దీనిలో లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ (3.7వోల్ట్స్, 730ఎంఏహెచ్)ఉంటుంది. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ప్రకారం కేవలం 2.5 గంటల్లోనే ఇది ఫుల్ చార్జ్ అవుతుంది.
జీబ్రానిక్స్ సౌండ్ ఫీస్ట్ 91.. ఈ పోర్టబుల్ స్పీకర్ ధర రూ. 1,999గా ఉంది. 24వాట్ల సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. బ్లూటూత్ 5.0 5.0, ఎఫ్ఎం రేడియో, టీడబ్ల్యూఎస్, 6.3ఎంఎం వైర్డ్ మైక్ సపోర్టు ఉంటుంది. యూఎస్బీ ఎంఎస్డీ, ఆక్స్, మొబైల్ హోల్డర్, ఆర్జీబీ లైట్లను కూడా కలిగి ఉంటుంది. ఇది అవుట్ డోర్లలో కూడా మంచి సౌండ్ క్లారిటీని అందిస్తుంది.
జీబీఎల్ గో 3.. ఈ పోర్టబుల్ స్పీకర్ ధర రూ. 2,999గా ఉంది. దీనిలో బ్యాటరీ 2.5 గంటల్లోనే ఫుల్ చార్జ్ అవుతుంది. ఐపీ67 రేటింగ్ తో నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటుంది. బ్లూ టూత్ 5.1 తో ఐదు గంటల ప్లే టైమ్ తో ఐదు గంటల బ్యాటరీ బ్యాకప్ ను కలిగి ఉంటుంది. ఆప్టిమమ్ ఆడియో సెట్టింగ్ అవసరం అవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..