Tecno Pova 5 Pro: సూపర్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసిన టెక్నో.. ఫీచర్స్ చూస్తే మతిపోతుందంతే..!
పెరిగిన అనూహ్య డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా టెక్నో కంపెనీ నయా స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. టెక్నో పోవా ప్రో 5 పేరుతో ఈ ఫోన్‌ను ఇండినేషియాలో రిలీజ్ చేసింది. ఆర్క్ ఇంటర్‌ఫేస్‌తో ప్రత్యేకమైన ఎల్‌ఈడీ ఆధారిత సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఫోన్ భారత్‌లో రూ.16000 ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడకం అనేది సర్వసాధరణమైపోయింది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత విద్యార్థులకు కూడా ఆన్లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ తప్పనిసరైంది. పెరిగిన అనూహ్య డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా టెక్నో కంపెనీ నయా స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. టెక్నో పోవా ప్రో 5 పేరుతో ఈ ఫోన్‌ను ఇండినేషియాలో రిలీజ్ చేసింది. ఆర్క్ ఇంటర్‌ఫేస్‌తో ప్రత్యేకమైన ఎల్‌ఈడీ ఆధారిత సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఫోన్ భారత్‌లో రూ.16000 ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ అతి త్వరలో భారత మార్కెట్‌లో రిలీజయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
టెక్నో పోవా 5 ప్రో ఫోన్ నథింగ్ ఫోన్-2 లానే ఆర్క్ ఇంటర్ ఫేస్ ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్ వెనుక ఆర్‌జీబీ ఎల్‌ఈడీ లైట్లతో వస్తుంది. దీని ద్వారా వినియోగదారులు, ఇన్‌కమింగ్ కాల్స్, సందేశాలు, ఇతర నోటిఫికేషన్ల గురించి ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ఫోన్ 6.78 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే మీడియాటెక్ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే అధిక హీట్ నుంచి రక్షణ పొందేందుకు 2820 ఎంఎం ఆవిరి కూల్డ్ చాంబర్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఏఐ సెకండరీ కెమెరాతో వస్తుంది. అలాగే 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. అలాగే 16 ఎంపీ సెల్ఫీకెమెరాతో వస్తుంది. అలాగే ఈ ఫోన్ 256 జీబీ అంతర్గత నిల్వతో వస్తుంది. 68 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ అమెజాన్‌లో ఇప్పటికే ప్లే అవుతున్నందున త్వరలోనే ఈ ఫోన్ భారత్‌లోనే అందుబాటులోకి రానుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







