Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tecno Foldable Phone: రెండు స్క్రీన్‌లు.. ఐదు కెమెరాలు.. అదరగొట్టే ఫీచర్లతో మడతపెట్టే ఫోన్..

టెక్నో సంస్థ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫాంటమ్ వీ ఫోల్డ్ 5జీ(PHANTOM V Fold 5G) పేరుతో బాలివుడ్ స్టార్, టెక్నో బ్రాండ్ అంబాసిడర్ ఆయుష్మన్ కురాన్ చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించింది.

Tecno Foldable Phone: రెండు స్క్రీన్‌లు.. ఐదు కెమెరాలు.. అదరగొట్టే ఫీచర్లతో మడతపెట్టే ఫోన్..
Tecno Phantom V Fold
Follow us
Madhu

| Edited By: seoteam.veegam

Updated on: Apr 18, 2023 | 12:09 PM

ఫోల్డబుల్ ఫోన్ల ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే శామ్సంగ్ పలు ఫోల్డబుల్ ఫోన్లు ఆవిష్కరించి మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో టెక్నో సంస్థ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫాంటమ్ వీ ఫోల్డ్ 5జీ(PHANTOM V Fold 5G) పేరుతో బాలివుడ్ స్టార్, టెక్నో బ్రాండ్ అంబాసిడర్ ఆయుష్మన్ కురాన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అంతేకాక ఏడాదికి 24 మిలియన్ ఫోన్లను ఉత్పత్తి చేసేలా నోయిడాలో కొత్త ప్లాంట్ ని సైతం టెక్నో సంస్థ ప్రారంభించింది. ఈ ఫాంటమ్ వీ ఫోల్డ్ 5జీ ఫోన్ లో రెండు అమోలెడ్ డిస్‍ప్లేలు, ఏకంగా ఐదు కెమెరాలు ఉండటం విశేషం. అంతేకాక ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక స్పెసిఫికేషన్లతో వినియోగదారులకు ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రెండు డిస్ ప్లేలు.. ఈ టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ ఫోన్ లో 7.85 అంగుళాల 2కే ప్లస్ అమోలెడ్ మెయిన్ డిస్‍ప్లే, ఇది 8:7 ఆస్పెక్ట్ రేషియో, 90శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. అలాగే 6.42 అంగుళాల మరో ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ ఔటర్ డిస్‍ప్లే ను కలిగి ఉంది. 21:9 ఆస్పెక్ట్ రేషియో, 91శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఔటర్ డిస్‍ప్లే ఉపయోగపడుతుంది. తెరచినప్పుడు మెయిన్ డిస్‍ప్లే వాడుకోవచ్చు.

సామర్థ్యం.. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ మొబైల్‍లో మీడియాటెక్ డైమన్సిటి 9000+ ఫ్లాగ్‍షిప్ 5జీ ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ HiOSతో వచ్చింది. దీనిలో బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. 45 వాట్ల వాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ద్వారా కేవలం 15 నిమిషాలలో 40 శాతం బ్యాటరీ, 55 నిమిషాలలో ఫుల్ గా బ్యాటరీ చార్జ్ అవుతుంది. దీనిలో 2000 యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని వాడకోవచ్చు.

కెమెరా సెటప్.. ఈ ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ పోట్రయిట్ కెమెరాలు ఉన్నాయి. ఔటర్ డిస్‍ప్లేకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫోల్డ్ ఓపెన్ చేసి వాడేటప్పుడు వినియోగించుకునేందుకు ప్రైమరీ డిస్‍ప్లేకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. మొత్తం ఐదు కెమెరాలు ఇందులో ఉన్నాయి.

ధర, లభ్యత.. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉన్న టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.88,888గా ఉంది. అమెజాన్‍లో ఇంట్రడక్టరీ ఆఫర్ కింద దీనిని రూ.77,777 కే పొందవచ్చు. అలాగే హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.5000 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ప్రతి కొనుగోలుపై రూ. 5000 విలువచేసే ఫ్రీ ట్రాలీ బ్యాగ్ కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..