AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tecno Spark 10: రూ. 13వేలలో 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. 50 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు స్టన్నింగ్‌ ఫీచర్స్‌.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. టెక్నో స్పార్క్‌ 10 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లో 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేయడం ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు...

Tecno Spark 10: రూ. 13వేలలో 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. 50 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు స్టన్నింగ్‌ ఫీచర్స్‌.
Tecno Spark 10
Narender Vaitla
|

Updated on: Mar 31, 2023 | 8:43 AM

Share

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. టెక్నో స్పార్క్‌ 10 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లో 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేయడం ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభంకానుంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ వీ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో మీడియా టెక్‌ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ను అందించారు.

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఇంటర్నల్‌ మెమొరీనీ 1టీబీ వరకు పెంచుకునే అవకాశం ఇచ్చారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 12,999గా ఉండనుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలకోసం 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్స్‌కి సపోర్ట్‌ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఈ బ్యాటరీని కేవలం 50 నిమిషాల్లోనే 50 శాతం చార్జ్‌ చేయవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లేను 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌రేట్‌తో రూపొందించారు. 480 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ అందించడం ఈ స్క్రీన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 50 మెగాపిక్సెల్ మెయిన్‌ కెమెరాతోపాటు ఎఫ్‌/1.6 అప్రెచర్‌, ఏఐ సెకండరీ లెన్స్‌ను ప్రత్యేకంగా అందించారు. ఏప్రిల్‌ 7న తొలి సేల్ ప్రారంభంకానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ అన్ని రకాల ఆన్‌లైన్‌ప్లాట్‌పామ్స్‌తో పాటు, ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉండనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే
రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే
62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్
62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..
సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..
పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..
పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..
ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..
ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..
ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే సగ్గుబియ్యం ఇడ్లీ ఇలా ఈజీగా చేసేయండి
ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే సగ్గుబియ్యం ఇడ్లీ ఇలా ఈజీగా చేసేయండి
'జెట్లీ' హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. ఫొటోస్ ఇదిగో
'జెట్లీ' హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. ఫొటోస్ ఇదిగో
RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??
RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??