AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Watch: స్మార్ట్ వాచ్‌ల్లోనే ఆఫ్‌లైన్ మ్యాప్స్.. కొత్త ఫీచర్ అనేబుల్ చేసిన గూగుల్

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో యువత అధికంగా స్మార్ట్ యాక్ససరీస్‌ను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ స్మార్ట్ వాచ్‌ను వాడుతున్నారు. ఈ స్మార్ట్ వాచ్‌లో ఆరోగ్య సంబంధిత ఫీచర్లు కూడా రావడంతో కొంత మంది వృద్ధులు, మధ్య వయస్కులు కూడా స్మార్ట్ వాచ్‌లను ఇష్టపడుతున్నారు. గూగుల్ తన నావిగేషన్ సాధనం, గూగుల్ మ్యాప్స్‌నకు సంబంధించిన సామర్థ్యాలను దాని వేరియబుల్ గ్యాడ్జెట్స్‌కు విస్తరిస్తోంది. పలు నివేదికల ప్రకారం ఇటీవల ఆఫ్‌లైన్ గూగుల్ మ్యాప్స్ మద్దతుతో పిక్సెల్ వాచ్ 3ని ప్రారంభించింది.

Smart Watch: స్మార్ట్ వాచ్‌ల్లోనే ఆఫ్‌లైన్ మ్యాప్స్.. కొత్త ఫీచర్ అనేబుల్ చేసిన గూగుల్
Maps In Smart Watch
Nikhil
|

Updated on: Aug 21, 2024 | 4:21 PM

Share

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో యువత అధికంగా స్మార్ట్ యాక్ససరీస్‌ను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ స్మార్ట్ వాచ్‌ను వాడుతున్నారు. ఈ స్మార్ట్ వాచ్‌లో ఆరోగ్య సంబంధిత ఫీచర్లు కూడా రావడంతో కొంత మంది వృద్ధులు, మధ్య వయస్కులు కూడా స్మార్ట్ వాచ్‌లను ఇష్టపడుతున్నారు. గూగుల్ తన నావిగేషన్ సాధనం, గూగుల్ మ్యాప్స్‌నకు సంబంధించిన సామర్థ్యాలను దాని వేరియబుల్ గ్యాడ్జెట్స్‌కు విస్తరిస్తోంది. పలు నివేదికల ప్రకారం ఇటీవల ఆఫ్‌లైన్ గూగుల్ మ్యాప్స్ మద్దతుతో పిక్సెల్ వాచ్ 3ని ప్రారంభించింది. ఈ ఫీచర్ త్వరలో అన్ని ఇతర వేర్ ఓఎస్ పరికరాలకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా స్మార్ట్‌వాచ్‌తో నావిగేట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. గూగుల్ తీసుకొచ్చిన తాజా ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

పిక్సెల్ వాచ్ 2లోని వేర్ ఓఎస్ బీటా వెర్షన్ 11.140.0701.డబ్ల్యూ కోసం గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులో ఉంది. బీటా వెర్షన్‌కు అప్‌డేట్ చేసిన తర్వాత వినియోగదారులు ఫోన్‌లోని ఆఫ్‌లైన్ మ్యాప్‌లు వాచ్‌కి ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అవుతాయి. యాప్ సెట్టింగ్‌ల ఎంపికకు ఎగువన ఉన్న కొత్త ఆఫ్‌లైన్ మ్యాప్స్ బటన్‌ను కూడా చూపుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పటికే ఉన్న ఏవైనా ఆఫ్‌లైన్ మ్యాప్‌లను సమకాలీకరించడంతో పాటు వాచ్ యాప్ వినియోగదారు ప్రాంతానికి సంబంధించిన మ్యాప్‌ను ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ చేస్తుంది. అదనంగా కొత్త ఫీచర్ వినియోగదారులకు డౌన్‌లోడ్ చేసిన ఆఫ్‌లైన్ మ్యాప్ వారి పరికరంలో ఎంత మెమరీను తీసుకుంటుందనే దాని గురించి ఒక ఆలోచనను ఇస్తుంది. వినియోగదారులు ఒక్క టచ్‌తో మ్యాప్‌లను తొలగించడానికి అనుమతిస్తుంది. అయితే ఆఫ్‌లైన్ మ్యాప్‌లు ఆన్‌లైన్ మ్యాప్‌లతో పోల్చితే అదే సంఖ్యలో ఫీచర్‌లను అందించవు. కానీ కొత్త లేదా సుదూర ప్రదేశాలకు ప్రయాణించే వ్యక్తులకు ఇది నమ్మదగిన బ్యాకప్‌ను అందిస్తుంది.

ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశంలోని దాని వినియోగదారుల కోసం దాని మ్యాప్స్ సాధనానికి ఆరు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఇందులో ఫ్లైఓవర్ నావిగేషన్, ఏఐ-పవర్డ్ నారో రోడ్ ఎగవేత, మెట్రో టికెట్ బుకింగ్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇంటిగ్రేషన్, రోడ్ క్లోజర్‌ల రిపోర్టింగ్ ఉన్నాయి. భారతదేశంలోని వినియోగదారులకు ఫ్లైఓవర్ తీసుకోవడం లేదా తీసుకోకపోవడం అనేది ఒక సాధారణ సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు 40 భారతీయ నగరాల్లో సిఫార్సు చేసిన మార్గాలతో పాటు ఫ్లైఓవర్‌లను హైలైట్ చేస్తుంది. ఇది డ్రైవర్‌లు వారి ప్రయాణాల సమయంలో రాబోయే ఎలివేటెడ్ రోడ్‌వేలకు బాగా సిద్ధం చేయడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..