AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Tips: కారు సైడ్ మిర్రర్ మీద ఉండే రెడ్ లైట్‌కి అర్థం తెలుసా? ఈ అలర్ట్‌ దేనికోసం?

కంపెనీ ఈ అధునాతన భద్రతా ఫీచర్‌ను మీ కారులో చేర్చినట్లయితే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనుక నుండి మరొక కారు వచ్చినప్పుడు ఈ ఫీచర్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. మీరు లేన్‌లను మారుస్తున్నప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ బ్లైండ్ స్పాట్ ప్రాంతాన్ని గుర్తిస్తుంది. వాహనం వెనుక నుండి మీ కారు వద్దకు చేరుకుంటే మీ కారు లోపల లేదా మీ కారు సైడ్ మిర్రర్‌లలో రెడ్ లైట్ వస్తుంది. ఈ లైట్‌ని చూడటం ద్వారా మీరు దీన్ని డేంజర్ బెల్‌గా కూడా పరిగణించవచ్చు..

Car Tips: కారు సైడ్ మిర్రర్ మీద ఉండే రెడ్ లైట్‌కి అర్థం తెలుసా? ఈ అలర్ట్‌ దేనికోసం?
Car Tips
Subhash Goud
|

Updated on: Feb 23, 2024 | 5:19 PM

Share

ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌ను జోడిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నుంచి కస్టమర్లను రక్షించేందుకు కార్ల తయారీదారులు అధునాతన భద్రతా ఫీచర్లను జోడిస్తున్నారు. ఇప్పుడు వాహనాలు శక్తివంతమైన ఫీచర్లను పొందుతున్నాయి. వాహనాల్లో కనిపించే (ADAS-Advanced driver assistance systems) వ్యవస్థలు రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సహాయపడే అనేక అధునాతన భద్రతా ఫీచర్స్‌ను పొందుపరుస్తున్నాయి కంపెనీలు. ఈ రోజు మనం వాహనాల్లో కనిపించే బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు డ్రైవర్‌కు ఎలా సహాయపడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం.

బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఫీచర్ ఎలా పని చేస్తుంది?

కంపెనీ ఈ అధునాతన భద్రతా ఫీచర్‌ను మీ కారులో చేర్చినట్లయితే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనుక నుండి మరొక కారు వచ్చినప్పుడు ఈ ఫీచర్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. మీరు లేన్‌లను మారుస్తున్నప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ బ్లైండ్ స్పాట్ ప్రాంతాన్ని గుర్తిస్తుంది. వాహనం వెనుక నుండి మీ కారు వద్దకు చేరుకుంటే మీ కారు లోపల లేదా మీ కారు సైడ్ మిర్రర్‌లలో రెడ్ లైట్ వస్తుంది. ఈ లైట్‌ని చూడటం ద్వారా మీరు దీన్ని డేంజర్ బెల్‌గా కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ మీకు వెనుక నుండి మరొక వాహనం వస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో మీరు లేన్‌లను మార్చవద్దని హెచ్చరిస్తోంది. దీని వల్ల ప్రమాదాలు జరుగకుండా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ ఫీచర్ అన్ని వాహనాల్లో అందుబాటులో ఉందా?

పాత వాహనాల్లోనే కాదు.. కానీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న చాలా కొత్త వాహనాలు ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి. బ్లైండ్ స్పాట్ అలర్ట్ సిస్టమ్ ప్రయోజనాల గురించి మాట్లాడితే.. ఇది లేన్‌లను మార్చేటప్పుడు, తిరిగేటప్పుడు డ్రైవింగ్‌ను సురక్షితంగా చేస్తుంది. అంతే కాకుండా, ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది.

జాగ్రత్త కూడా అవసరం

వాహనంలో అందించిన బ్లైండ్ స్పాట్ అలర్ట్ సిస్టమ్ మంచిదే కానీ పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడటం మంచిది కాదు. మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఫీచర్‌ మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుందని భావించవద్దు. వాహనం నడుపుతున్న సమయంలో ఎప్పుడు కూడా ఫీచర్స్‌పై ఆధారపడకుండా మీఅంతటి మీరే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

మరిన్ని టెక్నాలజీ  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
రూ.50లక్షలు పెడితే రూ.100కోట్లకు పైగా వసూళ్లు
రూ.50లక్షలు పెడితే రూ.100కోట్లకు పైగా వసూళ్లు
IPL 2026 Auction: వేలం తర్వాత మారిన ముగ్గురు కెప్టెన్లు..
IPL 2026 Auction: వేలం తర్వాత మారిన ముగ్గురు కెప్టెన్లు..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అదే హీరో సినిమాలో హీరోయిన్..!
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అదే హీరో సినిమాలో హీరోయిన్..!