Poco M6 5G: పోకోతో జత కట్టిన ఎయిర్‌టెల్.. సరికొత్త ఫీచర్స్‌తో బోలెడన్ని అదనపు లాభాలు
స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా 5 జీ సేవలు సపోర్ట్ చేసేలా సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా పోకో కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌తో జతకలిసి మార్కెట్లో చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్ పోకో ఎం 6 5జీ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్‌లతో కేవలం రూ. 8,799కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్‌లు కూడా ఎయిర్‌టెల్ నుంచి 50 జీబీ మొబైల్ డేటాను బోనస్‌గా పొందవచ్చు.

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఇటీవల కాలంలో భారతదేశంలో 5జీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. క్రమేపి అన్ని కంపెనీలు 5 జీ సర్వీసులు లాంచ్ చేస్తున్నాయి. అలాగే స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా 5 జీ సేవలు సపోర్ట్ చేసేలా సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా పోకో కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌తో జతకలిసి మార్కెట్లో చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్ పోకో ఎం 6 5జీ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్‌లతో కేవలం రూ. 8,799కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్‌లు కూడా ఎయిర్‌టెల్ నుంచి 50 జీబీ మొబైల్ డేటాను బోనస్‌గా పొందవచ్చు. మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ కాకపోయినా ఈ ఆఫర్‌ను పొందాలనుకుంటే ఈ ప్రయోజనాన్ని ఆస్వాదించడానికి తక్షణ యాక్టివేషన్‌తో సేవలను పొందవచ్చు.
పోకో ఎం6 ప్రో ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందించబడుతుంది 4 జీబీ + 128 జీబీ రూ.9,499, 6జీబీ +128 జీబీ వేరియంట్ రూ.10,499, 8జీబీ +256 జీబీ వేరియంట్ ధర రూ.12,499గా ఉంటుంది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. పోకో, ఎయిర్‌టెల్ మధ్య సహకారం భారతీయ వినియోగదారులకు అధిక-నాణ్యతతో పాటు సరసమైన స్మార్ట్‌ఫోన్‌లను అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బడ్జెట్ ప్రియులను ఆకట్టుకునేలా 4జీబీ + 128 జీబీ స్టోరేజ్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక ధర రూ.8799కి అందుబాటులో ఉంటుంది. ఆకట్టుకునే ఫీచర్లతో పాటు పోటీ ధర, ఎయిర్‌టెల్ సేవల అదనపు ప్రయోజనాలతో పోకో ఎం 6 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.
ఎయిర్‌టెల్ భాగస్వామ్యంపై అత్యంత సరసమైన 5జీ ఫోన్ పోకో ఎం 6 ప్రో కోసం మరోసారి ఎయిర్‌టెల్‌తో భాగస్వామిగా ఉండటానికి మేము సంతోషిస్తున్నామని పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ అన్నారు. పోకో సీ 51 కోసం మా మునుపటి సహకారం విజయవంతం అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న మరింత మంది కస్టమర్‌లకు, ముఖ్యంగా యువతకు పోకో కంపెనీకు సంబంధించిన అత్యుత్తమ సాంకేతికతను అందించడంలో ఈ భాగస్వామ్యం మాకు సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నామని వివరిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




