AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laptop Slow: మీ ల్యాప్‌టాప్ స్లో అవుతుందా..? ఈ ట్రిక్స్‌ ఉపయోగిస్తే స్పీడప్‌ అవుతుంది

ల్యాప్‌టాప్‌లో ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు స్లో అయిపోతుంటే పని చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. చికాకు వేస్తుంటుంది. చాలా మందికి ఈ సమస్య వస్తుంటుంది. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చాలా మందికి తెలియదు. ఉదయం నుంచి రాత్రి వరకు ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లో మునిగి తేలుతుంటారు. దాన్ని సరిచేసుకోవడం మంచిది. లేకుంటే సర్వీస్‌ సెంటర్‌కు తీసుకుపోతే ఖర్చు పెరిగిపోతుంటుంది...

Laptop Slow: మీ ల్యాప్‌టాప్ స్లో అవుతుందా..? ఈ ట్రిక్స్‌ ఉపయోగిస్తే స్పీడప్‌ అవుతుంది
Laptop
Subhash Goud
|

Updated on: Mar 10, 2024 | 12:40 PM

Share

ల్యాప్‌టాప్‌లో ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు స్లో అయిపోతుంటే పని చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. చికాకు వేస్తుంటుంది. చాలా మందికి ఈ సమస్య వస్తుంటుంది. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చాలా మందికి తెలియదు. ఉదయం నుంచి రాత్రి వరకు ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లో మునిగి తేలుతుంటారు. దాన్ని సరిచేసుకోవడం మంచిది. లేకుంటే సర్వీస్‌ సెంటర్‌కు తీసుకుపోతే ఖర్చు పెరిగిపోతుంటుంది. కానీ మీరు డబ్బు ఆదా చేయాలనుకుంటే ఇంట్లోనే దీనిని సరి చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.

ల్యాప్‌టాప్‌లో చాలా ట్యాబ్‌లను తెరిచి ఉంచవద్దు:

చాలా మంది పని చేసే సౌలభ్యం కోసం ల్యాప్‌టాప్‌లో చాలా వరకు ట్యాబ్‌లను ఓపెన్‌ చేసి ఉంచుతారు. దీని వల్ల మీ ల్యాప్‌టాప్‌ నెమ్మదించే అవకాశం ఉంది. మీరు మీ బ్రౌజర్‌లో ఎన్ని ట్యాబ్‌లను తెరిస్తే, మీ పరికరం ర్యామ్‌ లేదా ప్రాసెసర్ అంత ఒత్తిడికి గురవుతుంటుంది. అలాంటి సమయంలో మీ ల్యాప్‌టాప్‌ స్లో అవుతుంటుంది. దీని వల్ల మీ పనికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. వీలైనంత తక్కువగా కొత్త ట్యాబ్‌లను ఓపెన్‌ చేసి ఉంచుకోకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

ప్రోగ్రామ్‌లను పరిశీలించండి:

కొన్నిసార్లు మీకు తెలియకుండానే ల్యాప్‌టాప్ దాచిన ప్రోగ్రామ్‌లు రన్ అవుతూ ఉంటాయి. ఫలితంగా ల్యాప్‌టాప్ పనిచేయదు. స్లో అవుతుంది. Ctrl+Shift+Escని కలిపి నొక్కడం ద్వారా టాస్క్ మేనేజర్‌కి వెళ్లండి. అక్కడికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. బ్యాగ్రౌండ్‌లో ఏయే ప్రోగ్రామ్‌లు అనవసరంగా రన్ అవుతున్నాయో జాబితాను చూస్తే తెలుస్తుంది. మీరు మూసివేయాలనుకుంటున్న ప్రోగ్రామ్‌పై కుడివైపు క్లిక్ చేసి, ఆపై ‘ఎండ్ టాస్క్’పై క్లిక్ చేయండి. ఇలా కొన్ని ట్రిక్కులు పాటించడం వల్ల కంప్యూటర్‌ స్పీడప్‌ అవుతుంటుందని గుర్తించుకోండి.

అలాగే కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ డెస్క్‌టాప్‌పైన అనవసరమైన పైల్స్‌ ఉంచుకోకూడదు. దీని వల్ల కూడా సిప్రోగ్రామ్‌పై లోడ్‌ పడి నెమ్మదిస్తుంటాయి. ల్యాప్‌టాప్‌లో ఎప్పటికప్పుడు క్యాచీఫైళ్లను క్లీయర్‌ చేసుకోవాలి. అలాగే డిలీట్‌ చేసిన ఫైల్‌లు డస్ట్‌బిన్‌లో చేరిపోతుంటాయి. అక్కడి నుంచి కూడా క్లీయర్‌ చేసుకోవడం మంచిది. అలాగే ల్యాప్‌టాప్‌, డెస్క్‌టప్‌లలో వీడియో అవసరం లేకుండా వీడియో ఎడిటింగ్‌ యాప్స్‌ వేసుకోకూడదు. దీని వల్ల కూడా స్లో అవుతుంటుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్.. ఇంట్లోనే పొడిపొడిగా ఇలా చేసుకోండి!
రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్.. ఇంట్లోనే పొడిపొడిగా ఇలా చేసుకోండి!
దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి!
దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి!
మొబైల్ ద్వారా ఈపీఎఫ్ పెన్షన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
మొబైల్ ద్వారా ఈపీఎఫ్ పెన్షన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
పిల్లలు లావెక్కుతున్నారా? ముందుగా ఇంట్లో ఈ అలవాట్లను చూడండి!
పిల్లలు లావెక్కుతున్నారా? ముందుగా ఇంట్లో ఈ అలవాట్లను చూడండి!
ఈ ఒక్క నామం జపిస్తే మనసు ఎందుకు తేలికగా అనిపిస్తుంది?
ఈ ఒక్క నామం జపిస్తే మనసు ఎందుకు తేలికగా అనిపిస్తుంది?
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..
సెప్టెంబర్‌లో పుట్టారా? ఈ లక్షణాలే మీ బలమట!
సెప్టెంబర్‌లో పుట్టారా? ఈ లక్షణాలే మీ బలమట!
నేపాల్‌ వరదల నుంచి తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌ రెడ్డి
నేపాల్‌ వరదల నుంచి తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌ రెడ్డి
వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. కుటుంబంపై చెడు ప్రభావం
వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. కుటుంబంపై చెడు ప్రభావం
యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..?
యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..?