Gold Price Today: బంగారం ధర ఎందుకు పెరుగుతోంది.. తాజా రేట్ల వివరాలు

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఈరోజు అంటే ఆదివారం (మార్చి 10) మాత్రం స్థిరంగా ఉన్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ప్రతి రోజు దాదాపు 500 రూపాయలకుపైగా పెరుగుతూనే ఉంది. దేశంలోని చాలా నగరాల్లో 24 క్యారెట్ల పసిడి ధర 66,270 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో నేడు 22 క్యారెట్ల బంగారం ధర

Gold Price Today: బంగారం ధర ఎందుకు పెరుగుతోంది.. తాజా రేట్ల వివరాలు
Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: Mar 10, 2024 | 6:24 AM

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఈరోజు అంటే ఆదివారం (మార్చి 10) మాత్రం స్థిరంగా ఉన్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ప్రతి రోజు దాదాపు 500 రూపాయలకుపైగా పెరుగుతూనే ఉంది. దేశంలోని చాలా నగరాల్లో 24 క్యారెట్ల పసిడి ధర 66,270 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,750గా ఉంది. ఉంది. మార్చి నెలలో ఇప్పటివరకు బంగారం ధరలు వరుసగా 7 రోజులుగా 3440 రూపాయల వరకు పెరిగింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం బంగారం 21.10 డాలర్లు పెరిగింది. COMEXలో ఔన్స్ $ 2186.20 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. ఒక్కో ఔన్స్‌కి 24.52 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.

శనివారం బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయి నమోదు కాగా, ఆదివారం మాత్రం నిలకడగా ఉన్నాయి. మరోవైపు రజతం కూడా స్థిరంగానే ఉంది. మీరు బంగారం మరియు వెండిని కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ ధరలను గమనించడండి. బంగారం ధరను తెలుసుకునే ముందు 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం ముఖ్యం. 24 క్యారెట్లు ఎలాంటి కల్తీ లేకుండా 100% స్వచ్ఛమైన బంగారం. అయితే 22 క్యారెట్లలో వెండి లేదా రాగి వంటి అల్లాయ్ లోహాలు జోడిస్తారు. ఇందులో 91.67 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంది.ఇక పసిడి రేట్ల పెరిగేందుకు చాలా కారణాలు ఉన్నాయనే చెప్పాలి. ముఖ్యమైన కారణం ఏంటంటే.. అంతర్జాతీయంగా గోల్డ్‌ ధరలు పెరగడమే. అమెరికా తన మానిటరీ పాలసీ ఈ సంవత్సరం చివరిలో సడలింపు ఇస్తుందనే అభిప్రాయాలు బంగారం ధరల ర్యాలీకి దోహదం చేశాయి. అమెరికా డాలర్‌ పనితీరుతో గోల్డ్‌ రేటు పెరుగుదలకు ముడిపడి ఉందనే చెప్పాలి. శనివారం US డాలర్ విలువను కొలిచే డాలర్ ఇండెక్స్ 104 దిగువకు పడిపోయింది.103.80 వద్ద ఉంది. డాలర్ బలహీనంగా మారుతున్న నేపథ్యంలో బంగారం ధర మరింతగా పెరుగుతోంది.

దేశంలోని ముఖ్యనగరాల్లో బంగారం ధరలు ఇలా..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,500 ఉండగా, 24 క్యారెట్ల తూలం పసిడి ధర రూ.67,100 వద్ద ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.60,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,270 వద్ద ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.66,420 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.60,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.66,270 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే దేశంలో కిలో వెండి ధర రూ.75,700 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్