AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Saab: ప్రభాస్ జోకర్ గెటప్ ఆలోచన దర్శకుడు మారుతీ కాదట.! ఎవరో తెలిస్తే నోరెళ్లబెడతారు

'ది రాజా సాబ్' సినిమా ఎండ్‌లో ప్రభాస్ జోకర్ గెటప్.. సీక్వెల్‌కు పాయింట్ చెబుతూ క్లోజ్ అవుతుంది. మరి ఆ గెటప్ ఆలోచన ఎవరదన్నది దర్శకుడు మారుతీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ వివరాలు ఇలా.. ఓ సారి స్టోరీ తెలుసుకుందామా..

Raja Saab: ప్రభాస్ జోకర్ గెటప్ ఆలోచన దర్శకుడు మారుతీ కాదట.! ఎవరో తెలిస్తే నోరెళ్లబెడతారు
The Raja Saab
Ravi Kiran
|

Updated on: Jan 10, 2026 | 11:09 AM

Share

దర్శకుడు మారుతీ, హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ది రాజా సాబ్’. జనవరి 9న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మారుతీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాల వెనుకున్న క్రియేటివ్ ప్రాసెస్‌లో తన కుమార్తె హియా దాసరి కీ రోల్ పోషిస్తుందని తెలిపాడు. సినిమాలంటే హియాకు చాలా ఇష్టమని.. చిన్న వయస్సులోనే ఆమెకు సినిమాలపై మంచి అవగాహన ఉందని చెప్పాడు. తాను తీయబోయే ప్రాజెక్టుల గురించి ఏం మాట్లాడినా.. ముందుగానే అలోచించి హియా తన అభిప్రాయాన్ని చెబుతుంది. అందుకే ప్రతీ సినిమా షూటింగ్‌కు ఆమెను వెంట తీసుకెళ్తానని పేర్కొన్నాడు.

ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’

‘ది రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్ జోకర్ గెటప్‌కు సంబంధించిన ఆలోచన హియా దాసరిదేనని దర్శకుడు మారుతీ అన్నాడు. ఈ విషయాన్ని హీరో ప్రభాస్‌తో కూర్చుని డిస్కస్ చేసిందని.. ఆ కాన్సెప్ట్ హీరోకి కూడా నచ్చిందని తెలిపాడు. మరోవైపు హియాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్‌పై ప్రత్యేకమైన ఆసక్తి ఉందన్నాడు దర్శకుడు మారుతీ. ముఖ్యంగా జోకర్ థీమ్ పెయింటింగ్స్ ఆమె బాగా వేస్తుందని.. అవి అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఈ ఆసక్తితోనే పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఒకటి నిర్వహించిందని.. పెయింటింగ్‌తో పాటు ఫోటోగ్రఫీపై కూడా హియాకు మంచి పట్టు ఉందని మారుతీ పేర్కొన్నాడు. కాగా, ‘ది రాజాసాబ్’ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించగా.. తమన్ సంగీతాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

భీమాళి మామిడి తాండ్రకు ప్రత్యేక గుర్తింపు.. రైతులకు అండగా..
భీమాళి మామిడి తాండ్రకు ప్రత్యేక గుర్తింపు.. రైతులకు అండగా..
అదో షుగర్ బాంబ్! జెన్ జీల ఫేవరెట్ ఫుడ్ వెనుక చేదు నిజం ఇదే!
అదో షుగర్ బాంబ్! జెన్ జీల ఫేవరెట్ ఫుడ్ వెనుక చేదు నిజం ఇదే!
విదుర నీతి: మనిషి దుఃఖానికి అసలు కారణాలు ఇవే.. వదులుకుంటే హ్యాపీ
విదుర నీతి: మనిషి దుఃఖానికి అసలు కారణాలు ఇవే.. వదులుకుంటే హ్యాపీ
కార్ల టైర్లలో నైట్రోజన్‌ లేదా సాధారణ గాలి.. ఇందులో ఏది మంచిది?
కార్ల టైర్లలో నైట్రోజన్‌ లేదా సాధారణ గాలి.. ఇందులో ఏది మంచిది?
ఇంటి పునాది తీస్తుండగా బయటపడిన కుండ.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్..
ఇంటి పునాది తీస్తుండగా బయటపడిన కుండ.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్..
చలికాలంలో ఇవి తింటే మీ చిట్టి గుండె పని అయిపోయినట్లే..
చలికాలంలో ఇవి తింటే మీ చిట్టి గుండె పని అయిపోయినట్లే..
నేను చేసిన పెద్ద తప్పు అదే.. ఇప్పటికీ బాధపడుతున్నా..!
నేను చేసిన పెద్ద తప్పు అదే.. ఇప్పటికీ బాధపడుతున్నా..!
ఈ బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం కావాలంటే మీకు ఎంత జీతం ఉండాలి?
ఈ బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం కావాలంటే మీకు ఎంత జీతం ఉండాలి?
ప్రతి తరం తనను తాను తోపు అనుకుంటే జరిగే నష్టమేంటో తెలుసా?
ప్రతి తరం తనను తాను తోపు అనుకుంటే జరిగే నష్టమేంటో తెలుసా?
చాణక్య నీతి: ఈ వ్యక్తుల మధ్య ఎప్పుడూ దూరకండి, లేదంటే చిక్కులే
చాణక్య నీతి: ఈ వ్యక్తుల మధ్య ఎప్పుడూ దూరకండి, లేదంటే చిక్కులే