Cinema : పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమ్మాయిలను దారుణంగా చంపే కిల్లర్.. ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి సరికొత్త కంటెంట్ చిత్రాలు వస్తున్నాయి. ఈమధ్యకాలంలో హారర్, క్రైమ్, సస్పె్న్స్ సినిమాలను అడియన్స్ తెగ చూసేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈనెలలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ? అసలు స్టోరీ ఏంటీ అనేది తెలుసుకుందామా.. ?

మలయాళంలో మెగాస్టార్ ముమ్ముట్టి ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ కలంకావల్. బాక్సాఫీస్ వద్ద రూ.85 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ మూవీ. ఇప్పుడు అదే చిత్రం ఓటీటీలోకి వస్తుంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఇప్పుడు దాదాపు 40 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈసారి సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతోపాటు సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ సైతం ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ చిత్రాన్ని కనుమ సందర్భంగా జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
“నేరం కంటే లోతుగా విశ్లేషించే క్రైమ్ థ్రిల్లర్ లో ముమ్ముట్టిని చూడండి. కలంకావల్ జనవరి 16 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది” అంటూ రాసుకొచ్చారు మేకర్స్. ఈ సినిమాను మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషలలోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. నిజానికి మలయాళంలో వచ్చే సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ , హారర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. నిజ జీవితంలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ సయనైడ్ మోహన్ కథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
కథ విషయానికి వస్తే.. కేరళ తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళలను తీసుకెళ్లి.. ఆ తర్వాత వారిపై దాడి చేసి సయనైడ్ ఇచ్చి హత్య చేసే ఒక కిల్లర్ కథ ఇది. ఇందులో ముమ్ముట్టి నెగిటివ్ షేడ్స్ ఉన్న స్టాన్లీ దాస్ అనే సీరియల్ కిల్లర్ పాత్రలో నటించగా.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో వినాయకన్ నటించారు. ఈ సినిమాలో మమ్ముట్టి యాక్టింగ్ కు మరోసారి అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమ గతేడాది కేవలం 17 రోజుల్లోనే రూ.85 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..




