Laptops: ల్యాప్‌టాప్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 30వేల లోపు ధరతో, మంచి ఫీచర్లతో..
ప్రస్తుతం ల్యాప్‌టాప్ వినియోగం అనివార్యంగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు, విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్ అవసరం పెరిగింది. దీంతో ల్యాప్‌టాప్ అమ్మకాలు భారీగా పెరిగాయి. మరి రూ. 30వేల లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఏంటి.? వాటి ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ల్యాప్‌టాప్ వినియోగం అనివార్యంగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు, విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్ అవసరం పెరిగింది. దీంతో ల్యాప్‌టాప్ అమ్మకాలు భారీగా పెరిగాయి. మరి రూ. 30వేల లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఏంటి.? వాటి ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
HP Laptop 15s: రూ. 30 వేల లోపు అందుబాటలో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్స్‌లో హెచ్‌పీ ల్యాప్‌టాప్ 15ఎస్ ఒకటి. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 33,934కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 25,990కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 15.6 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఇందులో 512 జీబీ హార్డ్ డిస్క్‌ను, 8 జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో బ్రైట్ వ్యూ, హెచ్‌డీ, మైక్రో ఎడ్జ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను అందించారు.
ASUS VivoBook 15: రూ. 30 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్స్‌లో అసుస్ వివో బుక్ 15 ఒకటి. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 33,999కాగా ఏకంగా 41 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో రూ. 19,990కే సొంతం చేసుకోవచ్చు. 4జీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. ఇక ఈ ల్యాప్‌టాప్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 15.6 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు.512 జీబీ హార్డ్ డిస్క్ ఈ ల్యాప్‌టాప్ సొంతం. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో ఫింగర్ ప్రింట్ రీడర్, బ్లాక్‌కిట్ కీబోర్డ్, యాంటీ గ్లేర్ కోటింగ్ వంటి ఫీచర్లను అందించారు.
HP Chromebook X360 Intel Celeron N4120: తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్‌లో హెచ్‌పీ క్రోమ్‌బుక్ ఎక్స్360 ఒకటి. ఈ ల్యాప్ అసలు ధర రూ. 33,578కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 19,990కి సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌లో 14 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. మైక్రో ఎడ్జ్ టచ్ స్క్రీన్‌ను ఇచ్చారు. 4జీబీ ర్యామ్ ఈ ల్యాప్‌టాప్ సొంతం. అయితే హార్డ్ డిస్క్ మాత్రం కేవలం 64 జీబీ మాత్రమే అందించారు. ఇందులో బిల్ట్ ఇన్‌గా గూగుల్ అసిస్టెంట్‌ను అందించారు.
HP 255 G8 Notebook: హెచ్‌పీ 255 జీ8 నోట్‌బుక్ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 38,729 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 26,590కే సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. యాంటీ గ్లేర్ హెచ్‌డీ ఈ ల్యాప్‌టాప్ సొంతం. ఇందులో ఎమ్‌ఏడీ రైజన్ ప్రాసెసర్‌ను అందించారు. యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్‌ను ఇచ్చారు.
Lenovo V15 G3 IAP Laptop: తక్కువ ధరలో లభిస్తోన్న మరో బెస్ట్ ల్యాప్‌టాప్‌లో లెనోవో వీ15 ఒకటి. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 68,490గా ఉండగా అమేజాన్‌లో 59 శాతం డిస్కౌంట్‌తో రూ. 27,990కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 15.60 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఏడాది వారంటీ అందిస్తున్నారు. 512 జీబీ హార్డ్ డిస్క్, 8 జీబీ ర్యామ్ ఈ ల్యాప్‌టాప్ సొంతం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..