Poco c55: బంపరాఫర్.. రూ. 6వేలలోనే 128 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్..
పోకో సీ55 స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999కాగా అమెజాన్‌లో ఏకంగా 54 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,499కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌తో ఇక్కడితోనే ఆగిపోలేదు.. అమెజాన్ ప్రత్యేకమైన బ్యాంక్ తదితర ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీనిపై ఉన్న బ్యాంక్ ఆఫర్లలో భాగంగా.. దీనిని వన్ కార్డ్...

స్మార్ట్ ఫోన్ కంపెఈల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మరీ ముఖ్యంగా 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రావడం, 5జీ స్మార్ట్ ఫోన్‌ల ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో 4జీ ఫోన్‌లపై కంపెనీలు భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో పోకో ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. పోకో సీ55 స్మార్ట్ ఫోన్‌పై ఈ ఆఫర్ లభిస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంత.? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పోకో సీ55 స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999కాగా అమెజాన్‌లో ఏకంగా 54 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,499కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌తో ఇక్కడితోనే ఆగిపోలేదు.. అమెజాన్ ప్రత్యేకమైన బ్యాంక్ తదితర ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీనిపై ఉన్న బ్యాంక్ ఆఫర్లలో భాగంగా.. దీనిని వన్ కార్డ్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 350 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే ఈ మొబైల్ ఇతర క్రెడిట్ కార్డు సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ ఆధారంగా గరిష్టంగా రూ. 6,150 వరకు డిస్కౌంట్ బోనస్ పొందొచ్చు. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ పూర్తి డిస్కౌంట్‌కు ఎలిజిబుల్ అయితే కేవలం రూ. 299కే పోకో సీ55 స్మార్ట్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.71 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. 720 x 1650 రిజల్యూషన్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను అందించారు.
ఇక కెమెరా విషయానికొస్తే పోకో సీ55 స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 3.5 ఎమ్‌ఎమ్ ఆడియో జాక్‌ను ఇచ్చారు. బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఇదిలా ఉంటే అమెజాన్‌లో ఈ ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందన్న దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




