Actor : చిన్నప్పటి నుంచే నత్తి అని ఎగతాళి చేశారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో..
అతడు పాన్ ఇండియా స్టార్ హీరో.. కానీ మీకు తెలుసా.. ? చిన్నప్పుడే నత్తితో తెగ ఇబ్బందిపడ్డాడు. నత్తిగా మాట్లాడడంతో స్కూల్లో తన తోటి విద్యార్థులు ఎగతాళి చేశారు. దీంతో ఒంటరిగా ఉండేవాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో. లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఏకైక హీరో. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

సినీరంగంలో స్టార్ హీరోహీరోయిన్లుగా వెలగడం అంటే సులభం కాదు.. వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను అలరించిన సెలబ్రెటీల జీవితాల్లో ఊహించని చీకటి రోజులు కూడా ఉంటాయి. నిజ జీవితంలో అవమానాలు, విమర్శలు ఎదుర్కొని పట్టుదలతో గుర్తింపు తెచ్చుకున్నవారు ఉన్నారు. అలాగే ఆరోగ్య సమస్యలతో పోరాటం చేసి.. తమకంటూ ప్రత్యేక స్థాయిని ఏర్పర్చుకున్న తారలు సైతం ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఒకరు. చిన్నప్పుడు అతడు నత్తిగా మాట్లాడే సమస్యతో ఇబ్బంది పడ్డాడు. చిన్న చిన్న మాటలు కూడా పలకడానికి కూడా రాలేదు. అందరూ ఎగతాళి చేయడంతో తరచుగా బాత్రూంలో లేదా గదిలో తాళం వేసుకునేవాడు. కానీ అతను కష్టపడి పనిచేయడం, అంకితభావంతో తన ఇబ్బందులను అధిగమించాడు. చిన్నప్పటి నుంచే తన సమస్యను దూరం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కట్ చేస్తే.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన సినిమా కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి రాకేష్ రోషన్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కాగా, తల్లి పింకీ రోషన్ గృహిణి. ఆయన తాత రోషన్‌లాల్ నగ్రత్ సంగీతకారుడు, మామ రాజేష్ రోషన్ కూడా సంగీతంలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి కుటుంబంలో జన్మించినప్పటికీ అతడు బాల్యం మాత్రం దారుణంగా గడిపాడు. చిన్నప్పుడే నత్తి సమస్యతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అతడు మరెవరో కాదు..హీరో హృతిక్ రోషన్..
హృతిక్ రోషన్ జనవరి 10, 1974న ముంబైలో జన్మించాడు. హృతిక్ చిన్నప్పటి నుంచి నత్తిగా మాట్లాడేవాడు. చిన్నప్పుడు నత్తి సమస్యను తగ్గించుకోవడానికి ప్రతిరోజూ వార్తాపత్రికలు చదివే అలవాటును పెంచుకున్నాడు. హిందీ, ఇంగ్లీష్ , ఉర్దూ వార్తాపత్రికలను చదవడం ద్వారా, అతను క్రమంగా తన మాట్లాడే నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. దీంతో నత్తి సమస్య తగ్గింది. హృతిక్ 10 సంవత్సరాల వయసులో బాల నటుడిగా తెరంగేట్రం చేశాడు. రజనీకాంత్ నటించిన “భగవాన్ దాదా”లో కనిపించాడు.
2000 సంవత్సరంలో “కహో నా… ప్యార్ హై” సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. దీంతో అతడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా మారాడు. హృతిక్ కటౌట్, ఆకట్టుకునే కళ్లు, చిన్న చిరునవ్వు అతడిని జనాలకు మరింత దగ్గర చేశాయి . ముఖ్యంగా అమ్మాయిలలో ఓ రేంజ్ ఫాలోయింగ్ పెరిగింది.
హృతిక్ అనేక అవార్డులను కూడా అందుకున్నాడు. అతను ఉత్తమ అరంగేట్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నృత్యకారుడిగా అనేక అవార్డులను గెలుచుకున్నాడు. అతని “ధూమ్ 2,” “క్రిష్,” “జిందగీ నా మిలేగీ దోబారా,” “సూపర్ 30” వంటి చిత్రాలు అతడికి స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. కెరీర్ , వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఆత్మ విశ్వాసంతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మొదటి భార్యతో విడాకుల తర్వాత ఇప్పుడు సనా ఆజాద్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
