Video: చివరి నిమిషంలో వివాదం.. కోర్టులో ఆటగాళ్ల రచ్చ.. కట్‌చేస్తే.. స్వర్ణంతో రివేంజ్ తీర్చుకున్న భారత్..
Indian Mens Kabaddi Team: ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన 2018 ఆసియా క్రీడల్లో ఇరాన్ భారత్‌ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈసారి టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ టైటిల్ మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్‌లో వివాదం ఎంత తారాస్థాయికి చేరిందంటే ఇరు జట్ల సహాయక సిబ్బంది కూడా మైదానంలోకి దూసుకురావాల్సి వచ్చింది. భారత జట్టు కోచ్ భాస్కరన్ రిఫరీలతో నిరంతరం వాగ్వాదానికి దిగాడు. చివరకు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి భారత్‌ను విజేతగా ప్రకటించారు.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు శనివారం జరిగిన కఠినమైన, వివాదాస్పద ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత్ 31-29తో ఇరాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో చివరి నిమిషాల్లో రైడ్‌కు సంబంధించి వివాదం చోటు చేసుకుంది. దీని కారణంగా రెండు జట్లూ రిఫరీతో మొండిగా పోరాడాయి. దీంతో గంటకు పైగా సమయం వృథా అయింది. అంతకుముందు ఆసియా క్రీడల్లో ఎదురైన ఓటమిని భారత్ గెలిచి సమం చేసింది. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల సెమీ ఫైనల్‌లో ఇరాన్ భారత్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో వివాదం ఎంత తారాస్థాయికి చేరిందంటే ఇరు జట్ల సహాయక సిబ్బంది కూడా మైదానంలోకి దూసుకురావాల్సి వచ్చింది. భారత జట్టు కోచ్ భాస్కరన్ రిఫరీలతో నిరంతరం వాగ్వాదానికి దిగాడు. ఇరు జట్లు వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేకపోవడంతో, కొద్దిసేపు ఈ వివాదం అలాగే కొనసాగింది.




పవన్ దాడిపై వివాదం..
After the 3-1 or 1-1 points controversy drama , India clinches gold in #Kabaddi at the #AsianGames23 .
India took tha revenge of 2018 defeat in style 🔥pic.twitter.com/PpCT0osiDT
— Ankit 🚬 (@Imankit6908) October 7, 2023
సెకండాఫ్ చివరి నిమిషంలో భారత రైడర్ పవన్ సెహ్రావత్ ఇరాన్ శిబిరంపై దాడి చేసేందుకు వెళ్లాడు. ఇది డూ ఆర్ డై రెడ్. ఇరాన్ పవన్‌ను కోర్టు నుంచి లాబీలోకి పంపి పాయింట్లు దక్కించుకుంది. అయితే, ఇక్కడ పవన్ తానే బయటకు వెళ్లానని, తనను ఎవరూ బయటకు పంపలేదని, తాను బయటకు వెళ్లిన తర్వాత ఇరాన్ ఆటగాళ్లు తనను తాకారని, దీని వల్ల భారత్‌కు నాలుగు పాయింట్లు రావాలన్నారు. దీనిపై భారత్ సమీక్ష జరిపి నాలుగు పాయింట్లు కోరింది. కాగా, పవన్‌ను బయటకు పంపాలని ఇరాన్ డిమాండ్ చేసింది. సమీక్ష తర్వాత పవన్, బస్తామి ఔట్ అయినట్లు ప్రకటించారు. దీంతో రెండు జట్లకు కూడా ఒక్కొక్క పాయింట్ అందించారు.
మ్యాచ్ సస్పెండ్..
అయితే ఈ నిర్ణయం కూడా నచ్చకపోవడంతో మరింత గందరగోళం ఏర్పడింది. పాత నిబంధనల ప్రకారం పవన్ ఔట్ కావడంతో ఇరాన్ ఆటగాళ్లు టచ్ చేయడంతో భారత్‌కు నాలుగు పాయింట్లు రావాల్సి ఉంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఇద్దరికీ ఒక్కో పాయింట్ లభించింది. ఇక్కడ స్కోరు 29-29తో సమమైంది. అనంతరం భారత ఆటగాళ్లు తమ నిరసనను తెలియజేశారు. ఆ తర్వాత మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి 32-29తో భారత్‌ను విజేతగా ప్రకటించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
