Team India: కీలక మ్యాచ్ నుంచి హార్దిక్ ఔట్.. న్యూజిలాండ్‌పై గెలిస్తేనే భారత్ ముందుకు.. లేదంటే ఇంటికే..

India vs New Zealand Hockey World Cup 2023: జనవరి 15న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ స్నాయువు గాయంతో బాధపడ్డాడు. ఈ గాయం కారణంగా వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను బరిలోకి దిగలేదు. దీంతో రేపు జరిగే మ్యాచ్‌ టీమిండియాకు చావోరేవోలా మారింది.

Team India: కీలక మ్యాచ్ నుంచి హార్దిక్ ఔట్.. న్యూజిలాండ్‌పై గెలిస్తేనే భారత్ ముందుకు.. లేదంటే ఇంటికే..
Hardik Singh
Follow us

|

Updated on: Jan 21, 2023 | 12:21 PM

Hockey World Cup 2023: అంతా భయపడిందే జరిగింది. హార్దిక్ సింగ్‌ను భారత జట్టు నుంచి తప్పించారు. దీంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత్ కష్టాలు మరింత పెరిగాయి. జనవరి 15న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ స్నాయువు గాయంతో బాధపడ్డాడు. ఈ గాయం కారణంగా వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను బరిలోకి దిగలేదు. అతను కోలుకుంటాడనే ఆశతో జట్టు వైద్య సిబ్బంది అతని గాయంపై నిఘా ఉంచారు. కానీ, ఆ ఆశ నిజం కాకపోవడంతో హార్దిక్ సింగ్ హాకీ ప్రపంచకప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

హార్దిక్ సింగ్ తొలగింపు నిర్ణయంపై చీఫ్ కోచ్ గ్రాహం రీడ్ మాట్లాడుతూ, “ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా కష్టమైంది. కానీ, ఈ హాకీ ప్రపంచకప్‌లో హార్దిక్ సింగ్ ఇక ఆడలేడని న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందే మేం ఒక నిర్ణయానికి రావలసి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు.

భారత జట్టులో హార్దిక్‌కు ప్రత్యామ్నాయం ఎవరు?

ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో హార్దిక్ సింగ్ స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ప్రశ్నగా మారింది. కాబట్టి గ్రాహం రీడ్ కూడా దీనికి సమాధానం ఇచ్చాడు. హార్దిక్ సింగ్ స్థానంలో రాజ్ కుమార్ పాల్ జట్టులోకి వస్తాడని ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

హార్దిక్ గాయంపై గ్రాహం రీడ్ మాట్లాడుతూ, “ప్రారంభంలో గాయం చాలా తీవ్రంగా లేదని అనిపించింది. అయితే ఇప్పుడు ఆ గాయం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని, పునరావాసం అవసరమని తేలింది. ఆ తర్వాతే హార్దిక్ స్థానంలో రాజ్ కుమార్ పాల్ జట్టులోకి వస్తాడనే నిర్ణయానికి వచ్చాం. హార్దిక్ నిష్క్రమణ మాకు చాలా బాధ కలిగించింది. ముఖ్యంగా అతను మొదటి రెండు మ్యాచ్‌లలో తన అత్యుత్తమ ప్రదర్శన, అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. కానీ, ఇప్పుడు ఆయన స్థానంలో రాజ్ కుమార్ వస్తారన్నది నిజం’ అంటూ చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్‌ను ఓడిస్తేనే క్వార్టర్ ఫైనల్‌కు భారత్..

ప్రస్తుతం భారత జట్టు హాకీ ప్రపంచకప్ పూల్‌లో రెండో స్థానంలో ఉంది. ఇక క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరాలంటే ఆదివారం న్యూజిలాండ్‌‌పై క్రాస్‌ఓవర్‌లో గెలవడం తప్పనిసరి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ సింగ్ భారత్‌కు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కానీ, ఆయన తప్పుకోవడంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..