AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్‌, శిఖర్‌ల నయా రికార్డ్

మొహాలీ: ఆసీస్‌తో జరుగుతోన్న నాలుగో వన్డేలో భారత ఓపెన్లరు అదరగొట్టారు. ఎట్టకేలకు రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. జట్టు స్కోరు 62 పరుగుల వద్ద ఈ జోడి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వన్డేల్లో ఆసీస్‌పై వెయ్యి పరుగులు పూర్తి చేసిన మొదటి భారత ఓపెనర్లుగా వీరు నిలిచారు. వెస్టిండీస్‌ మాజీ ఆటగాళ్లు గార్డన్‌ గ్రీనిడ్జ్‌, డెస్మండ్‌ హేన్స్‌ ఇదివరకు ఆసీస్‌పై వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఓపెనర్లుగా ఉన్నారు. అనంతరం సచిన్‌ తెందూల్కర్‌, సౌరభ్‌గంగూలీ […]

రోహిత్‌, శిఖర్‌ల నయా రికార్డ్
Ram Naramaneni
|

Updated on: Mar 11, 2019 | 7:44 AM

Share

మొహాలీ: ఆసీస్‌తో జరుగుతోన్న నాలుగో వన్డేలో భారత ఓపెన్లరు అదరగొట్టారు. ఎట్టకేలకు రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. జట్టు స్కోరు 62 పరుగుల వద్ద ఈ జోడి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వన్డేల్లో ఆసీస్‌పై వెయ్యి పరుగులు పూర్తి చేసిన మొదటి భారత ఓపెనర్లుగా వీరు నిలిచారు. వెస్టిండీస్‌ మాజీ ఆటగాళ్లు గార్డన్‌ గ్రీనిడ్జ్‌, డెస్మండ్‌ హేన్స్‌ ఇదివరకు ఆసీస్‌పై వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఓపెనర్లుగా ఉన్నారు. అనంతరం సచిన్‌ తెందూల్కర్‌, సౌరభ్‌గంగూలీ జంట 827 పరుగులు చేసి మూడో స్థానంలో ఉంది. రోహిత్‌, శిఖర్‌ మొహాలీలో 15వ శతక భాగస్వామ్యం నెలకొల్పగా వన్డేల్లో అత్యథిక శతకాలు చేసిన జోడీగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అంతకుముందు గంగూలీ, సచిన్‌ 21 శతక భాగస్వామ్యాలు చేయగా వారి తర్వాతి స్థానంలో ఆడం గిల్‌క్రిస్ట్‌, మాథ్యూహెడెన్‌ 16 శతక భాగస్వామ్యాలు చేశారు.

మరోవైపు ఆసీస్‌పై అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు (5) చేసిన ఆటగాళ్లుగా రోహిత్‌, శిఖర్‌ధావన్‌ అగ్రస్థానంలో నిలిచారు. వారి తర్వాత గ్రీనిడ్జ్‌, రిచర్డ్స్‌ నాలుగు సెంచరీలతో రెండోస్థానంలో ఉన్నారు. అలాగే మూడో స్థానంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌, సచిన్‌ తెందూల్కర్‌ నాలుగు సెంచరీలు చేశారు. కాగా రోహిత్‌ శర్మ, శిఖర్‌ధావన్‌ ప్రపంచకప్‌ ముందు తిరిగి ఫామ్‌లోకి రావడంతో భారత జట్టుకు పెద్ద ఊరట లభించింది.

పడుకునే ముందు యూట్యూబ్‌ చేసే అలవాటు ఉందా?
పడుకునే ముందు యూట్యూబ్‌ చేసే అలవాటు ఉందా?
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ప్రభుత్వం నుంచి సంక్రాంతి గిఫ్ట్
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ప్రభుత్వం నుంచి సంక్రాంతి గిఫ్ట్
గిరిజన హక్కుల కోసం FRA డిజిటల్ ప్లాట్‌ఫామ్.. ఢిల్లీలో వర్క్‌షాప్!
గిరిజన హక్కుల కోసం FRA డిజిటల్ ప్లాట్‌ఫామ్.. ఢిల్లీలో వర్క్‌షాప్!
మహిళలు ఇది మీకే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఈ పనులు చేయకండి
మహిళలు ఇది మీకే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఈ పనులు చేయకండి
ఒక్క తప్పిదం.. 8ఏళ్ల శిక్ష.. డోపింగ్ ఉచ్చులో ఇద్దరు భారత ఆటగాళ్లు
ఒక్క తప్పిదం.. 8ఏళ్ల శిక్ష.. డోపింగ్ ఉచ్చులో ఇద్దరు భారత ఆటగాళ్లు
అంబానీయా మజాకా.! రూ. 91కే 28 రోజుల గోల్డెన్ ఆఫర్..
అంబానీయా మజాకా.! రూ. 91కే 28 రోజుల గోల్డెన్ ఆఫర్..
ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తే ఇన్ని లాభాలా? అందాల తారల రహస్యం ఇదేనట!
ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తే ఇన్ని లాభాలా? అందాల తారల రహస్యం ఇదేనట!
రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆ ఒక్క పని చేసుంటే బ్రతికేవాడు..
రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆ ఒక్క పని చేసుంటే బ్రతికేవాడు..
క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఈ విషయాలు కనిపిస్తున్నాయా..? అలర్ట్
క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఈ విషయాలు కనిపిస్తున్నాయా..? అలర్ట్
ఈ విధ్వంసం కనిపిస్తలేదా గంభీర్.. అరంగేట్రం ఛాన్స్ ఇంకెప్పుడు?
ఈ విధ్వంసం కనిపిస్తలేదా గంభీర్.. అరంగేట్రం ఛాన్స్ ఇంకెప్పుడు?