Deepti Sharma: మ్యాచ్ ఓడినా చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. తొలి క్రీడాకారిణిగా దీప్తి శర్మ..
Deepti Sharma: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఐసిసి మహిళల ప్రపంచ కప్ 2025 లో ఇంగ్లాండ్‌పై ఆమె నాలుగు వికెట్లు పడగొట్టి, ప్రత్యేక జాబితాలో తన స్థానాన్ని సంపాదించుకుంది.

Deepti Sharma: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ, ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్‌లో ఆమె తన డేంజరస్ బౌలింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన డూ-ఆర్-డై మ్యాచ్‌లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో ఇంతకు ముందు ఏ ఇతర భారతీయ మహిళా క్రీడాకారిణి సాధించని ఘనతను ఆమె సాధించింది.
చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ..
దీప్తి శర్మ మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో 20వ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన బౌలింగ్‌తో ఆమె గణనీయమైన విజయాన్ని సాధించింది. ఆమె 10 ఓవర్లు బౌలింగ్ చేసి 51 పరుగులకు నలుగురు బ్యాట్స్‌మెన్స్‌ను ఔట్ చేసింది. ఇంగ్లీష్ ఓపెనర్లు టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ మొదటి వికెట్‌కు 73 పరుగుల బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనించదగ్గ విషయం. ఇది భారత జట్టుకు ఆందోళన కలిగించే విషయంగా మారింది. అయితే, దీప్తి వెంటనే బాధ్యత తీసుకుని టామీ బ్యూమాంట్‌ను అవుట్ చేసింది.
దీప్తి @ 150 వన్డే వికెట్లు..
వన్డే క్రికెట్ లో 2,000 పరుగులు చేస్తూ 150 వికెట్లు తీసిన తొలి భారతీయురాలిగా, ప్రపంచంలో నాల్గవ క్రీడాకారిణిగా నిలిచింది. ఇప్పటివరకు వన్డేల్లో ఆమె 2,600 పరుగులు సాధించింది. ఆమెకు ముందు, ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్ పెర్రీ (4,414 పరుగులు, 166 వికెట్లు), వెస్టిండీస్‌కు చెందిన స్టెఫానీ టేలర్ (5,873 పరుగులు, 155 వికెట్లు), దక్షిణాఫ్రికాకు చెందిన మారిజాన్ కాప్ (3,397 పరుగులు, 172 వికెట్లు) ఈ ఘనత సాధించారు.
ఝులన్ గోస్వామి లిస్ట్‌లో..
Milestone unlocked 🔓
Deepti Sharma gives #TeamIndia the big breakthrough 💪
She also becomes just the 2⃣nd Indian player to complete 1⃣5⃣0⃣ wickets in women’s ODIs 👏
Updates ▶ https://t.co/jaq4eHbeV4#WomenInBlue | #CWC25 | #INDvENG | @Deepti_Sharma06 pic.twitter.com/ub1i069TIM
— BCCI Women (@BCCIWomen) October 19, 2025
భారత మహిళా క్రికెట్‌లో వన్డేల్లో 150 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండవ బౌలర్ దీప్తి. ఆమెకు ముందు, ఝులన్ గోస్వామి 204 మ్యాచ్‌ల్లో 255 వికెట్లు పడగొట్టింది. ఝులన్ తర్వాత ఈ మైలురాయిని సాధించడం ద్వారా, దీప్తి భారత మహిళా క్రికెట్‌కు కొత్త అధ్యాయాన్ని జోడించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








