రోహిత్ ప్లేస్‌లో గిల్‌ను వన్డే కెప్టెన్‌గా అందుకే నియమించాం.. ఆ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన గంభీర్
Rohit Sharma: వెస్టిండీస్‌ను చిత్తు చేసిన తర్వాత టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరనుంది. ఈ సిరీస్‌కు ముందు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఓ కీలక ప్రకటన చేశాడు. శుభ్‌మాన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా ఎందుకు నియమించారో గంభీర్ వివరించాడు.

Team India: భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీం ఇండియా అక్టోబర్ 15న బయలుదేరనుంది. దానికి ముందు, గౌతమ్ గంభీర్ భారత కొత్త వన్డే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ గురించి ఓ కీలక ప్రకటన చేశారు. శుభ్‌మాన్ గిల్ వన్డే కెప్టెన్‌గా ఉండటానికి ఎందుకు అర్హుడో గౌతమ్ గంభీర్ వివరించాడు. శుభ్‌మాన్ గిల్ ప్రత్యేక లక్షణాలను ఆయన హైలైట్ చేశారు. గిల్ కెప్టెన్సీలో టీమింఇండియా ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పుడు భారత జట్టు వెస్టిండీస్‌ను 2-0 తేడాతో ఓడించింది.
గిల్ కెప్టెన్ కావడానికి గల కారణాన్ని చెప్పిన గంభీర్..
శుభ్‌మన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించినట్లు గౌతమ్ గంభీర్ ప్రకటించారు. “అతను వన్డే కెప్టెన్సీకి అర్హుడని నేను భావిస్తున్నాను. గిల్ చాలా కష్టపడి పనిచేశాడు. అన్ని ప్రమాణాలను చేరుకున్నాడు. ఒక కోచ్‌గా, ఒక ఆటగాడు సరైన విషయాలు చెబుతుంటే, సరైన పనులు చేస్తుంటే, కష్టపడి పనిచేస్తుంటే, సరైన విధానాన్ని కలిగి ఉంటే, ముందుండి నడిపిస్తుంటే, ఒక కోచ్ ఇంకా ఏమి అడగగలడు? ఇది అతనికి కష్టమని నాకు తెలుసు” అని తెలిపాడు.
ఇంగ్లాండ్ సిరీస్‌లో రాటుదేలిన గిల్..
“ఇంగ్లాండ్ పర్యటన కష్టంగా ఉంది. ఇంగ్లాండ్ పర్యటన గిల్‌కు అత్యంత కఠినమైన పరీక్ష. ఐదు టెస్ట్ మ్యాచ్‌లు, రెండున్నర నెలలు ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టును ఎదుర్కొంది. జట్టు కూడా అనుభవం లేనిది. గిల్ ఇంకా ఏమి భరించాలి?” అని గౌతమ్ గంభీర్ అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనతో శుభ్‌మాన్ గిల్ వన్డే కెప్టెన్సీలో అరంగేట్రం చేస్తున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాను ఓడించడం చాలా కష్టం కాబట్టి, ఈ సిరీస్ అతనికి కఠినమైన పరీక్ష అవుతుంది. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు కూడా ఫామ్‌లో ఉంది. అయితే, విరాట్, రోహిత్ ఉనికి గిల్‌కు ఉపయోగకరంగా ఉండవచ్చు. ఆసియా కప్‌లో తెల్ల బంతితో విఫలమైనందున అభిమానులు గిల్ సొంత ప్రదర్శనను కూడా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








