NECC JPL సీజన్-2: సెమీఫైనల్ లో TV5 పై TV9 భారీ విజయం.. ఫైనల్లోకి గ్రాండ్ ఎంట్రీ
నెక్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ సీజన్-2లో భాగంగా హైదరాబాద్‌లోని MLRIT క్రికెట్ స్టేడియం వేదికగా డిసెంబర్ 10న TV5 Vs TV9 మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో టీవీ9 భారీ విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బరిలోకి దిగిన టీవీ5 కేలవం 67 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. స్వల్ప లక్ష్యాన్ని టీవీ9 కేవలం 8.1 ఓవర్లోనే చేధించి విజయకేతనం ఎగరవేసింది.

NECC జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ సీజన్-2లో భాగంగా డిసెంబర్ 10న TV5 Vs TV9 మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో టీవీ9 భారీ విజయం సాధించింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీవీ5 కేవలం 67 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీవీ9 ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ సెకండ్ ఎడిషన్ లో కూడా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది డిపెండింగ్ ఛాంపియన్ tv9. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న TV5.. 12 ఓవర్లలో 67 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
టీవీ9 బౌలర్లు అద్భుతంగా రాణించారు. కెప్టెన్ సాయి కిషోర్ 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. జగదీష్ 3 ఓవర్లలో కేవలం 12 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. రాము, సత్య, మాన్యాల శ్రీనివాస్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య చేధనలో భాగంగా టీవీ9 కేవలం 8.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది.
పవర్ ప్లేలో టీవీ9 కాస్త తడబడినట్టు కనబడినా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నిలకడతో సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది TV9. బ్యాటింగ్ లో యాంకర్ సత్య, ప్రసాద్, రిపోర్టర్ విజయ్ సాత రాణించడంతో విజయం సులభం అయింది… jpl-2 ఫైనల్ డిసెంబర్ 11 ఉదయం 10 గంటలకు సాక్షి టీవీతో జరుగుతుంది .
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




