Horoscope Today: వారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (December 11, 2025): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (డిసెంబర్ 11, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థింగా సహాయం చేస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు తప్పకపోవచ్చు. చిన్న పాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరు బంధువుల ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా ఉత్సాహం కలిగిస్తుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాలలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశించిన దానికంటే బాగా కలిసి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. రుణ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. కొందరు బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థిక, ఆస్తి వ్యవ హారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వివాదాలకు బాగా దూరంగా ఉండడం మంచిది. ఆదాయ వృద్దికి ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక సమస్యల్ని తీర్చుకుంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందనలు లభిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో ఆశించిన విధంగా పదోన్నతి లభించవచ్చు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. వివాహ సంబంధం నిశ్చయం అవుతుంది. ఆశించిన శుభవార్తలు అందుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబపరంగా అభి వృద్ధి ఉంటుంది. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయం వృద్ది చెందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు బాగా అనుకూలంగా పురోగమిస్తాయి. కుటుంబపరంగా శుభ వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వ్యక్తిగత సమస్యల విషయంలో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో కొద్దిగా శ్రమ, ఒత్తిళ్లు ఉంటాయి. వృత్తి జీవితంలో తీరిక లభించకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు కానీ, అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేయవద్దు. విదేశాలలో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు కలుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. తల్లితండ్రుల సహాయం లభిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, ప్రోత్సాహక రంగా సాగిపోతాయి. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆశించిన శుభవార్త వింటారు.



