AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Mataram: చరిత్ర తవ్వుకుంటున్న బీజేపీ-కాంగ్రెస్! మధ్యలో నెహ్రూ..RSS.

వందేమాతరం గీతంపై ఈ జనరేషన్‌కు తెలియని విషయాలు చాలా ఉన్నాయ్. 1875 నవంబర్ 7న.. వందేమాతరం గీతం పుట్టింది. బంకించంద్ర ఛటర్జీ ఆ గీతాన్ని కంపోజ్ చేసినప్పుడు రెండు చరణాలే ఉన్నాయ్ అనేది కొందరి వాదన. ఇప్పుడు మనమంతా పాడుకుంటున్నది కూడా ఆ రెండు చరణాలే. 1882లో బంకించంద్ర ఛటర్జీ రాసిన 'ఆనంద్ మఠ్' నవలలో వందేమాతరం గీతం పూర్తిస్థాయిలో ఉంటుంది. అంటే.. ఇప్పుడు పాడుకుంటున్న రెండు చరణాలకు తోడు మరో ఆరు చరణాలు ఉన్నాయ్. మరి.. వాటినెందుకు పాడడం లేదిప్పుడు? ఆ విషయాన్నే హైలెట్ చేస్తోంది బీజేపీ. మిగతా చరణాలు ఇప్పుడు పాడుకోలేకపోవడానికి కారణం.. నెహ్రూనే అంటోంది. ఒక అడుగు ముందుకేసి.. నెహ్రూ ఈ దేశానికి ద్రోహం చేశారని కామెంట్ చేసింది. అన్నదెవరో కాదు.. సాక్షాత్తు ప్రధాని మోదీ. రియాక్ట్ అయిన కాంగ్రెస్.. స్వాతంత్ర్యం కోసం 12 ఏళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి నెహ్రూ అని కౌంటర్ ఇచ్చింది. మరో అడుగు ముందుకేసి.. RSSను తీసుకొచ్చింది. ఈ దేశ స్వాతంత్ర్య సమరంలో RSS పాత్రేంటని నిలదీసింది. ఇంతకీ.. ఇప్పుడెందుకొచ్చిందీ గొడవ? వందేమాతరంపైనా, RSSపైనా పార్లమెంట్‌లో చర్చ ఎందుకు జరుగుతోంది? బెంగాల్ రాజకీయ నేపథ్యం ఉందా? ఆ డిటైల్స్ డిటైల్డ్‌గా తెలుసుకుందాం ....

Vande Mataram: చరిత్ర తవ్వుకుంటున్న బీజేపీ-కాంగ్రెస్! మధ్యలో నెహ్రూ..RSS.
Vande Mataram Dispute
Ram Naramaneni
|

Updated on: Dec 10, 2025 | 10:01 PM

Share

‘వందేమాతరం.. సుజలాం సుఫలాం..’ ఈ పదాలు విన్నా, పలికినా ఓ భావోద్వేగం. తెలియకుండానే గుండెలోతుల్లోంచి దేశభక్తి భావం ఉప్పొంగుతుంది. రోమాలు నిక్కబొడిచేంత ఉద్వేగం తన్నుకొస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే.. మరి స్వాంతంత్ర్య సంగ్రామంలో ఇంకెంతటి దేశభక్తిని రగిల్చి ఉంటుంది. స్వతంత్ర సమరయోధులకు ఊపిరిపోసిన గేయం.. వందేమాతరం. దీన్ని గేయంగా చూడలేదు ఆనాడు. దాన్నో నినాదంగా పలికారు. వందేమాతరం అని వినిపిస్తే చాలు బ్రిటిషర్స్ రగిలిపోయేవాళ్లు. అందుకేగా.. బెంగాల్ విభజన కూడా జరిగింది. అలాంటి గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఓ రాజకీయ రగడ జరుగుతోంది. ఎందుకని? వందేమాతరం గీతంలో మిగతా ఆరు చరణాలు ఏమయ్యాయ్? ఇప్పుడెందుకని పాడుకోవడం లేదు? దాని గురించి చెప్పుకునే ముందు.. అసలెందుకొచ్చిందీ ఈ టాపిక్ అనేది చెప్పుకోవాలి. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఆ సందర్బంలో వందేమాతరం గీతాన్ని ముక్కలు చేయడం వల్లే కదా ఈ దేశం ముక్కలైందనే మాట వాడారు. మహ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్… 1937లో వందేమాతరం గేయానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం నిజం కాదా అని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ఆనాడు జిన్నా ఒత్తిడికి తలొగ్గిన జవహర్‌లాల్ నెహ్రూ.. వందేమాతరంలోని ముఖ్యమైన చరణాలను తొలగించారనేది ప్రధాని మోదీ ప్రధాన ఆరోపణ. ఆ చరణాలే గనక ఉంటే.. ముస్లింలను మరింత రెచ్చగొట్టినట్టవుతుందన్న జిన్నా మాటలు వినే కదా వాటిని...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి