IND vs IRE: క్రికెట్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. నేడు ఐర్లాండ్‌తో టీమిండియా ఓపెనింగ్ మ్యాచ్.. జట్టులో కీలక మార్పులు
IND vs IRE, T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం (జూన్ 05) ఐర్లాండ్‌తో మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా ప్రపంచకప్ పోరాటాన్ని ప్రారంభించనుంది.

IND vs IRE, T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం (జూన్ 05) ఐర్లాండ్‌తో మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా ప్రపంచకప్ పోరాటాన్ని ప్రారంభించనుంది. పాల్ స్టిర్లింగ్ ఐర్లాండ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. టీమ్ ఇండియాతో పోలిస్తే ఐర్లాండ్ అంత బలంగా లేదు. కానీ సంచలనాలు సృష్టించడంలో ఐర్లాండ్ దిట్ట. అందువల్ల టీమ్ ఇండియా ఐర్లాండ్ ను తేలిగ్గా తీసుకోలేకపోతోంది. న్యూ యార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాబట్టి టాస్ రాత్రి 7:30 గంటలకు ఉంటుంది.
ఎక్కడ చూడొచ్చంటే..
Ready to go 👊🇮🇳
ఇవి కూడా చదవండిIndia players in good touch in the nets ahead of their opening #T20WorldCup match against Ireland 🙌 pic.twitter.com/3VmsAbPZN1
— T20 World Cup (@T20WorldCup) June 4, 2024
టీమ్ ఇండియా vs ఐర్లాండ్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో టీవీలో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ యాప్‌లో ఉచితంగా చూడవచ్చు.
All in readiness 🔥🔥
Match day loading ⏳#TeamIndia | #T20WorldCup | #INDvIRE pic.twitter.com/rwIYfcpXOk
— BCCI (@BCCI) June 4, 2024
టీ20 ప్రపంచకప్ కోసం ఇరు జట్లు
టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్.
All smiles in New York as #TeamIndia complete a 60-run win in the warmup clash against Bangladesh 👏👏
Scorecard ▶️ https://t.co/EmJRUPmJyn#T20WorldCup pic.twitter.com/kIAELmpYIh
— BCCI (@BCCI) June 1, 2024
ఐర్లాండ్ జట్టు:
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంప్ఫెర్, గారెత్ డెలానీ, జార్జ్ డాకెరెల్, గ్రాహం హ్యూమ్, జాషువా లిటిల్, బారీ మెక్‌కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ బెన్ వైట్ మరియు క్రెయిగ్ యంగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








