AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరకపోతే.. ఎంత డబ్బు వస్తుందో తెలుసా.?

T20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ మొత్తం ఫిక్సయింది. ఐసీసీ ఈసారి దాదాపు 93.50 కోట్ల రూపాయలను ప్రైజ్ మనీగా అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీగా రూ.20 కోట్లు అందుతాయి. 9వ ఎడిషన్ T20 ప్రపంచ కప్ 2024 జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభమైంది.

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరకపోతే.. ఎంత డబ్బు వస్తుందో తెలుసా.?
Team India
Ravi Kiran
|

Updated on: Jun 05, 2024 | 7:38 PM

Share

T20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ మొత్తం ఫిక్సయింది. ఐసీసీ ఈసారి దాదాపు 93.50 కోట్ల రూపాయలను ప్రైజ్ మనీగా అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీగా రూ.20 కోట్లు అందుతాయి. 9వ ఎడిషన్ T20 ప్రపంచ కప్ 2024 జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభమైంది. అనేక కారణాల వల్ల ఈ టీ20 ప్రపంచకప్ చాలా ప్రత్యేకమైనది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొనడం. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్. దీంతో ఈ లీగ్‌పై అందరి ఇంట్రస్ట్ పెరిగింది. కాగా, ఈ ఎడిషన్‌కు సంబంధించిన ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ప్రకారం, ఈ టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ 11.25 మిలియన్ యూఎస్ డాలర్లు. అంటే,మన కరెన్సీలో దాదాపు రూ.93.50 కోట్లు ప్రైజ్ మనీ అన్నమాట. ఈ మొత్తంలో ఛాంపియన్ జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.20 కోట్ల రూపాయల బహుమతి లభిస్తుంది.

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఛాంపియన్‌ జట్టుకు ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం అందజేయడం ఇదే తొలిసారి. ఛాంపియన్ జట్టుకు 20 కోట్లు ప్రైజ్ మనీ దక్కనుండగా.. రన్నరప్ జట్టు, అంటే ఫైనల్‌లో ఓడిన జట్టుకు 1.28 మిలియన్ డాలర్లు అందుతాయి. అంటే మన కరెన్సీలో 10.64 కోట్లు దక్కనున్నాయి. దీంతో పాటు సెమీఫైనల్‌లో ఓడిన జట్లకు కూడా భారీ బహుమతులు అందుతాయి. సెమీఫైనల్‌లో ఓడిన జట్లకు రూ. 6.5 కోట్లు లభిస్తాయి. ఇక టోర్నీలో పాల్గొనే ప్రతీ జట్టుకు రూ. 1.8 కోట్లు అందుతాయి.

ఒకవేళ భారత జట్టు సెమీఫైనల్‌కు చేరలేకపోతే.. సూపర్-8 గ్రూప్ పూర్తి చేసిన జట్టుకు రూ. 3.2 కోట్లు. ప్రతి విజయానికి ICC కేటాయించిన అదనపు మొత్తం ఆయా జట్లు పొందుతాయి. సూపర్-8 వరకు చేరిన ప్రతి జట్టుకు అదనంగా రూ. 26 లక్షలు అందుతాయి. కాబట్టి, టీమిండియా మొదటి రౌండ్‌లో అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధిస్తే, రూ. 1.04 కోట్లు దక్కుతాయి. సూపర్-8 వరకు సాధించిన విజయాల సంఖ్య ఆధారంగా, సెమీ-ఫైనల్‌కు చేరుకోని జట్టుకు సుమారు 4.5 కోట్ల రూపాయలు దక్కుతాయి. కాగా, గతసారి ప్రపంచ ఛాంపియన్‌కు రూ.12 కోట్లు వచ్చాయి. నిజానికి గతసారి కంటే ఈసారి రెట్టింపు ప్రైజ్ మనీని ఐసీసీ కేటాయించింది. గత ఎడిషన్‌లో, మొత్తం బహుమతి పరిమాణం 5.6 మిలియన్ డాలర్లు. ఈసారి ప్రైజ్ మనీలో సగం అన్నమాట. గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టుకు రూ.13 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్‌ జట్టుకు రూ.6.44 కోట్లు బహుమతిగా అందించారు. అయితే, ఈసారి ఫైనల్స్‌కు చేరే జట్ల ఖజానాకు భారీగా డబ్బు చేరనుంది.

ఇది చదవండి: SRH‌కి హిట్‌మ్యాన్.. RCBకి రాహుల్.. మెగా వేలంలోకి హేమాహేమీలు.! రిటైన్ లిస్టు ఇదిగో..

మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..