IND vs IRE Playing XI: టాస్ గెలిచిన రోహిత్.. వీడిన ఓపెనింగ్ జోడీ ఉత్కంఠ.. ప్లేయింగ్ 11 ఇదే..
ICC T20 World Cup India vs Ireland Playing XI: టీ20 ప్రపంచకప్‌లో భారత్ తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. ఇక్కడ టీమిండియా ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడింది.

టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి సంజూ శాంసన్, జైస్వాల్, కుల్దీప్ తప్పుకున్నారు. దీంతో టీమిండియా ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ బరిలోకి దిగనున్నారు.
ఇరు జట్లు:
🚨 Toss Update from New York 🚨
Captain @ImRo45 has won the toss & #TeamIndia have elected to bowl against Ireland.
Follow The Match ▶️ https://t.co/YQYAYunZ1q#T20WorldCup | #INDvIRE pic.twitter.com/bNQaPO854i
— BCCI (@BCCI) June 5, 2024
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
ఐర్లాండ్ (ప్లేయింగ్ XI): పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..