IPL 2025: SRHకి హిట్‌మ్యాన్.. RCBకి రాహుల్.. మెగా వేలంలోకి హేమాహేమీలు.! రిటైన్ లిస్టు ఇదిగో..
IPL సీజన్ 17 ముగిసిన వెంటనే, IPL 2025 మెగా వేలం గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా వచ్చే సీజన్‌కు మెగా వేలం జరగనుండడంతో రిటైన్ ప్రక్రియ కీలకంగా మారింది. అంటే IPL మెగా వేలం 2022 నిబంధనల ప్రకారం ఒక జట్టు కేవలం 4 మంది ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవాల్సి ఉంటుంది.
IPL సీజన్ 17 ముగిసిన వెంటనే, IPL 2025 మెగా వేలం గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా వచ్చే సీజన్‌కు మెగా వేలం జరగనుండడంతో రిటైన్ ప్రక్రియ కీలకంగా మారింది. అంటే IPL మెగా వేలం 2022 నిబంధనల ప్రకారం ఒక జట్టు కేవలం 4 మంది ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో మిగిలిన ఆటగాళ్లందరినీ విడిచిపెట్టాల్సిందే. అందుకే ఈ వేలంలో చాలామంది స్టార్ ప్లేయర్లు కనిపిస్తారని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. అయితే అంతకుముందు ఒక్కో ఫ్రాంచైజీ నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం అతిపెద్ద సవాల్‌గా మారింది. కాబట్టి మొత్తం 10 టీమ్‌లు ఎవరిని జట్టులో ఉంచుకుంటాయన్న దానిపై ఓ అంచనాకు వస్తే..
కోల్‌కతా నైట్ రైడర్స్:
సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్
చెన్నై సూపర్‌కింగ్స్:
రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, మతీషా పతిరన
ముంబై ఇండియన్స్:
జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, తిలక్ వర్మ
ఢిల్లీ క్యాపిటల్స్:
కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ మరియు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్
గుజరాత్ టైటాన్స్:
మహ్మద్ షమీ, శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్
ఇది చదవండి: కసి తీర్చుకుంటున్న కావ్య మారన్.. మెగా వేలంలోకి కమిన్స్‌తో పాటు ఆ ఇద్దరూ.. రిటైన్ లిస్టు ఇదే!
లక్నో సూపర్‌జెయింట్స్:
మార్కస్ స్టోయినిస్, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్
పంజాబ్ కింగ్స్:
అశుతోష్ శర్మ, సామ్ కరణ్, అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్
రాజస్థాన్ రాయల్స్:
రియాన్ పరాగ్, సంజూ శాంసన్, జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్
సన్‌రైజర్స్ హైదరాబాద్:
అభిషేక్ శర్మ, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
రజత్ పాటిదార్, విరాట్ కోహ్లి, విల్ జాక్స్, మహ్మద్ సిరాజ్
అటు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ మెగా వేలంలోకి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కొనుగోలు చేయాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా.. ఆయా ఫ్రాంచైజీలను రిక్వెస్ట్ చేస్తున్నారు. సదరు ఆటగాళ్లకు, వారి ఫ్రాంచైజీలకు మధ్య ఈ సీజన్‌లో బంధం సరిగ్గా లేకపోవడంతో.. కచ్చితంగా ఈ ఇద్దరు ప్లేయర్స్ మెగా వేలంలోకి వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది చదవండి: కడప టూ బెంగళూరు.. ఇకపై 6 గంటల ప్రయాణం కాదు.. వివరాలు ఇవిగో.!
మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి..