AP News: కడప టూ బెంగళూరు.. ఇకపై 6 గంటల ప్రయాణం కాదు.. వివరాలు ఇవిగో.!
కడప టూ బెంగళూరు.. ఓ 6 గంటల జర్నీ ఉంటుంది.. బస్సో.. లేదా ట్రైనో పట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం కష్టంతో కూడుకున్న పనే. అయితే ఇకపై ఈ రెండు నగరాలను కేవలం గంటన్నరలో కవర్ చేసేయొచ్చు. ఈ క్రమంలోనే కడప ప్రజలకు గుడ్ న్యూస్ స్థానిక ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ అందించారు. ఆ వివరాలు ఇలా..
కడప టూ బెంగళూరు.. ఓ 6 గంటల జర్నీ ఉంటుంది.. బస్సో.. లేదా ట్రైనో పట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం కష్టంతో కూడుకున్న పనే. అయితే ఇకపై ఈ రెండు నగరాలను కేవలం గంటన్నరలో కవర్ చేసేయొచ్చు. ఈ క్రమంలోనే కడప ప్రజలకు గుడ్ న్యూస్ స్థానిక ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ అందించారు. ఇకపై కడప ఎయిర్‌పోర్ట్ నుంచి దేశంలోని పలు మెట్రోపాలిటన్ నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయన్నారు. అలాగే కడప నుంచి వయా హైదరాబాద్ మీదుగా గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్, రాజమండ్రి, రాయపూర్, ఇండోర్, జబల్‌పూర్, ముంబై, చండీగర్, వారణాసి, జైపూర్, సూరత్, రాంచీ, ఢిల్లీ నగరాలకు వెళ్లొచ్చునన్నారు. అటు కడప వయా చెన్నై నుంచి వడోదర, కోయంబత్తూరు, మధురై, కోల్‌కతా, అహ్మదాబాద్, మైసూరు.. కడప వయా బెంగళూరు నుంచి తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్, హుబ్లీ, లక్నోకు ఇంటర్‌కనెక్టింగ్ ఫ్లైట్‌లలో వెళ్లొచ్చు. ఇక విమాన సర్వీసులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
విమాన సర్వీసులు | వచ్చి-వెళ్లే సమయం |
---|---|
చెన్నై-కడప | 08.05 – 09.20 |
కడప-చెన్నై | 14.00 – 15.20 |
కడప-విజయవాడ | 09.45 – 11.00 |
విజయవాడ-కడప | 11.45 – 13.20 |
బెంగళూరు-కడప | 09.25 – 10.30 |
కడప-బెంగళూరు | 15.10 – 16.15 |
కడప-విశాఖపట్నం | 10.50 – 12.40 |
విశాఖపట్నం-కడప | 13.00 – 14.50 |
హైదరాబాద్-కడప | 09.45 – 11.05 |
కడప-హైదరాబాద్ | 11.35 – 13.05 |
ఇది చదవండి: అబ్బబ్బ.. కూల్‌న్యూస్ అంటే ఇది కదా.. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలే
విమానాల రాకపోకలు ఇవే..
ప్రతిరోజు కడప టూ హైదరాబాద్ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే సోమ, బుధ, శుక్ర, ఆదివారం కడప-విజయవాడ-కడప విమాన సర్వీసులు.. సోమ, బుధ, శుక్ర, ఆదివారం చెన్నై-కడప-చెన్నై సర్వీసులు.. మంగళ, గురు, శనివారాలలో బెంగళూరు-కడప-బెంగళూరు విమాన సర్వీసులు.. మంగళ, గురు, శనివారం కడప-విశాఖపట్నం-కడప విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. ఈ సౌకర్యాలను ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని కడప ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ శివప్రసాద్ సూచించారు.
ఇది చదవండి: మీకు రేషన్ కార్డు ఉందా.? ఇలా చేస్తే.. ప్రతీ నెలా రూ. 5 వేలు మీ సొంతం.!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..