- Telugu News Photo Gallery Cricket photos These 4 Indian Players Will Play For First Time In T20 World Cup
ఐపీఎల్‌లో హిట్టు.. కట్ చేస్తే.. ఈ 4గురి ప్లేయర్ల టీ20 ప్రపంచకప్ ఎంట్రీ మాములుగా లేదుగా.!
జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈసారి జట్టులో కొంతమంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది. వీరిలో ఈ నలుగురు ఆటగాళ్లు తొలిసారిగా టీ20 ప్రపంచకప్ ఆడుతున్నారు. ఇంతకీ వారెవరు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Updated on: May 30, 2024 | 2:41 PM

జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈసారి జట్టులో కొంతమంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది. వీరిలో ఈ నలుగురు ఆటగాళ్లు తొలిసారిగా టీ20 ప్రపంచకప్ ఆడుతున్నారు.

సంజూ శాంసన్: దేశవాళీ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు అద్భుత ప్రదర్శన కనబరిచిన సంజూ శాంసన్‌కు భారత్ టీ20 ప్రపంచకప్ జట్టులో అవకాశం ఇవ్వాలని డిమాండులు వెల్లువెత్తాయి. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో సంజూ శాంసన్ 500కుపైగా పరుగులు చేశాడు. ఇప్పుడు భారత టీ20 ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో ఉన్న శాంసన్ తొలిసారి ప్రపంచకప్ ఆడనున్నాడు.

శివమ్ దూబే: చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన శివమ్ దూబే ఈ ఐపీఎల్‌లో తన పేలుడు బ్యాటింగ్‌తో అందరినీ ఆకర్షించాడు. దీంతో భారత ప్రపంచకప్ జట్టులో అవకాశం దక్కించుకున్న దూబేకి ఇది తొలి టీ20 ప్రపంచకప్.

జైస్వాల్: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న జైస్వాల్.. ఐపీఎల్‌లో సెంచరీ సాధించి టీ20 ప్లేయర్‌గా నిరూపించుకున్నాడు. జైస్వాల్ U-19 ప్రపంచకప్‌లో ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది అతడికి మొదటి ప్రపంచకప్.

యుజ్వేంద్ర చాహల్: ఎన్నో ఏళ్లుగా టీమ్ ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్న అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు తొలిసారిగా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది.




