AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SA vs BAN: 7 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 56 బంతుల్లోనే 109 రన్స్‌.. టీ20 ప్రపంచకప్‌లో మొదటి సెంచరీతో సంచలనం

రూసో కేవలం 52 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. రూసో సెంచరీలో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. టీ20ల్లో రూసోకు ఇది రెండో సెంచరీ కావడం విశేషం.

SA vs BAN: 7 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 56 బంతుల్లోనే 109 రన్స్‌.. టీ20 ప్రపంచకప్‌లో మొదటి సెంచరీతో సంచలనం
Rilee Rossouw
Basha Shek
|

Updated on: Oct 27, 2022 | 12:06 PM

Share

మొదటి మ్యాచ్‌లో విజయం అంచుల దాకా వచ్చి పాయింట్లు పంచుకున్న దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లో జూలు విదిల్చింది. టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా గ్రూప్ 2 సూపర్ 12 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారీ స్కోరు సాధించింది. జట్టులోకి పునరాగమనం చేసిన రీలే రూసో సెంచరీతో మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 205 రన్స్‌ చేసింది. రూసో కేవలం 52 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. రూసో సెంచరీలో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. టీ20ల్లో రూసోకు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటి వికెట్‌ త్వరగా కోల్పోయినా రెండో వికెట్‌కు డికాక్‌, రూసో 163 రన్స్‌ జోడించారు. అది కూడా 87 బంతుల్లోనే. రూసోకు మంచి సహకారం అందించిన డి కాక్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ 7 పరుగుల వద్ద ఔటయ్యాడు. చివరి దశలో మరింత రెచ్చిపోయి బ్యాటింగ్ చేసిన రూసో అద్భుత సెంచరీ సాధించాడు. కాగా బంగ్లాదేశ్‌ బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 2 వికెట్లు, తస్కిన్ అహ్మద్, ఆసిఫ్ హుస్సేన్ ఒక వికెట్ తీశారు.

విజయం తప్పనిసరి..

కాగా భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ ఎదురీదుతోంది. కడపటి వార్తలు అందే సమయానికి 7 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. అన్రిచ్‌ నోర్జే 2 ఓవర్లలో 4 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు జింబాబ్వేతో తలపడిన దక్షిణాఫ్రికా విజయం అంచుల దాకా వచ్చింది. వర్షం కారణంగా పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. కాబట్టి బంగ్లాదేశ్‌పై విజయం సాధించడం సఫారీలకు అత్యంత అవసరం.

ఇవి కూడా చదవండి

జట్టును విడిచిపెట్టి..

కాగా రీలే రూసో 2016లో తర్వాత దక్షిణాఫ్రికా జట్టును విడిచిపెట్టాడు. ఇంగ్లాండ్ కౌంటీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఇప్పుడు ఈ ఆటగాడు ఇంగ్లాండ్‌తో జరిగిన T20 సిరీస్ నుండి తిరిగి జట్టులోకి వచ్చాడు. అప్పటి నుండి రూసో నిరంతరం పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. కాగా ప్రపంచకప్‌నకు ముందు దక్షిణాఫ్రికా భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇండోర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ రోసో రెచ్చిపోయాడు. కేవలం 48 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..