AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NED, T20 Highlights: నెదర్లాండ్స్ పై భారీ విజయంతో అగ్రస్థానం చేరిన రోహిత్ సేన..

India vs Netherlands T20 World Cup 2022 Group 2 Highlights: భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించగా, నెదర్లాండ్స్ టీం బంగ్లాదేశ్‌ను ఓడించింది.

IND vs NED, T20 Highlights: నెదర్లాండ్స్ పై భారీ విజయంతో అగ్రస్థానం చేరిన రోహిత్ సేన..
Ind Vs Ned T20 World Cup 2022
Venkata Chari
|

Updated on: Oct 27, 2022 | 4:03 PM

Share

India vs Netherlands, Highlights: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై టీమిండియా 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మల ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. విరాట్ 44 బంతుల్లో 62, సూర్య 25 బంతుల్లో 51, రోహిత్ 39 బంతుల్లో 53 పరుగులు చేశారు. నెదర్లాండ్స్‌లో ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మెకెర్న్ తలొ 1 వికెట్ తీశారు.

అనంతరం నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్‌ తరపున భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ తలో 2 వికెట్లు తీశారు. అదే సమయంలో మహ్మద్ షమీ ఖాతాలో ఓ వికెట్ పడింది. ఈ విజయంతో భారత జట్టు 4 పాయింట్లతో గ్రూప్-2లో నంబర్-1కి చేరుకుంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 27 Oct 2022 04:00 PM (IST)

    IND vs NED: నెదర్లాండ్స్ పై భారీ విజయం..

    టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై టీమిండియా 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మల ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. విరాట్ 44 బంతుల్లో 62, సూర్య 25 బంతుల్లో 51, రోహిత్ 39 బంతుల్లో 53 పరుగులు చేశారు. నెదర్లాండ్స్‌లో ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మెకెర్న్ తలొ 1 వికెట్ తీశారు.

  • 27 Oct 2022 03:30 PM (IST)

    IND vs NED, T20 WC LIVE: 6వ వికెట్ డౌన్..

    15.4 ఓవర్లు ముగిసే సరికి నెదర్లాండ్స్ టీం 6 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. అశ్విన్ 2, అక్షర్ 2, భువీ 1, షమీ 1 వికెట్ పడగొట్టారు.

  • 27 Oct 2022 03:27 PM (IST)

    IND vs NED, T20 WC LIVE: 5వ వికెట్ డౌన్..

    14 ఓవర్లు ముగిసే సరికి నెదర్లాండ్స్ టీం 5 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. ప్రింగ్లే 13, ఎడ్ వర్డ్స్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అశ్విన్ 2, అక్షర్ 2, భువీ 1 వికెట్ పడగొట్టారు.

  • 27 Oct 2022 03:15 PM (IST)

    IND vs NED, T20 WC LIVE: 4వ వికెట్ డౌన్..

    భారీ స్కోర్ ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో కూరకపోతోంది. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు… అశ్విన్ ఓవర్లో మరో వికెట్‌ను కోల్పోయింది. 12.1 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 2, భువనేశ్వర్ 1, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.

  • 27 Oct 2022 03:11 PM (IST)

    IND vs NED, T20 WC LIVE: 3 వికెట్లు డౌన్..

    భారీ స్కోర్ ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో కూరకపోతోంది. 11 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 2, భువనేశ్వర్ 1 వికెట్ పడగొట్టారు.

  • 27 Oct 2022 02:54 PM (IST)

    ఆదిలోనే ఎదురు దెబ్బ..

    టీమిండియా ఇచ్చిన 180 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయి నెదర్లాండ్స్‌ కష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం క్రీజులో కోలిన్‌ అకెర్‌మాన్‌ (2), బాస్‌ డి లీడ్ (8) పరుగులతో కొనసాగుతున్నారు.

  • 27 Oct 2022 02:22 PM (IST)

    T20Iలలో కోహ్లీ – సూర్య 50+ భాగస్వామ్యాలు..

    98* ఆఫ్ 42 బాల్స్ vs HK దుబాయ్

    104 ఆఫ్ 62 బాల్స్ vs Aus హైదరాబాద్

    102 ఆఫ్ 42 బాల్స్ vs SA గౌహతి

    95* ఆఫ్ 48 బాల్స్ vs NED సిడ్నీ

  • 27 Oct 2022 02:18 PM (IST)

    నెదర్లాండ్స్ టార్గెట్ 180

    టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ముందు టీమిండియా 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రోహిత్‌ శర్మ రాణించడంతో భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. విరాట్ 44 బంతుల్లో 62, సూర్య 25 బంతుల్లో 51, రోహిత్ 39 బంతుల్లో 53 పరుగులు చేశారు. నెదర్లాండ్స్‌లో ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మెకెర్న్ తలో వికెట్ తీశారు.

  • 27 Oct 2022 02:00 PM (IST)

    IND vs NED, T20 WC LIVE: హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ..

    విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

  • 27 Oct 2022 01:42 PM (IST)

    IND vs NED, T20 WC LIVE: 100 చేరిన టీమిండియా స్కోర్..

    టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఈ క్రమంలో 13వ ఓవర్లో టీమిండియా స్కోర్ 100 పరుగులు దాటింది. సూర్య 11, విరాట్ 28 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 27 Oct 2022 01:36 PM (IST)

    IND vs NED, T20 WC LIVE: రోహిత్ ఔట్..

    రోహిత్ శర్మ 35 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్లతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత క్లాసెన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి, పెవిలియన్ చేరాడు. దీంతో 84 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.

  • 27 Oct 2022 01:32 PM (IST)

    IND vs NED, T20 WC LIVE: రోహిత్ హాఫ్ సెంచరీ..

    రోహిత్ శర్మ 35 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్లతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో రోహిత్ టీమిండియా తరపున ప్రపంచ కప్‌లో ఓ రికార్డ్ కూడా నెలకొల్పాడు. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తరపున 34 సిక్సర్లు బాది, యువరాజ్ పేరిట ఉన్న రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.

    టీ 20 ప్రపంచకప్‌లలో భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు..

    34 రోహిత్ శర్మ

    33 యువరాజ్ సింగ్

    24 విరాట్ కోహ్లీ

    టీ20 ప్రపంచకప్‌లలో రోహిత్ కంటే క్రిస్ గేల్ (63) మాత్రమే అత్యధిక సిక్సర్లు కొట్టాడు.

  • 27 Oct 2022 01:24 PM (IST)

    IND vs NED, T20 WC LIVE: కోహ్లీ, రోహిత్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం..

    పవర్ ప్లే ముగిసిన తర్వాత టీమిండియా జోరు పెంచింది. రోహిత్ 41, విరాట్ 14 పరుగులతో క్రీజులో నిలిచారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి 43 బంతుల్లో 53 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.

  • 27 Oct 2022 01:12 PM (IST)

    IND vs NED, T20 WC LIVE: పవర్ ప్లేలో పవర్ చూపని టీమిండియా..

    పవర్ ప్లే ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేసింది. కేఎల్ రాహుల్ 9 పరుగులు చేసి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఇక రోహిత్ 16, విరాట్ 6 పరుగులతో క్రీజులో నిలిచారు. చిన్న జట్టైనా.. బౌలింగ్‌లో నెదర్లాండ్ జట్టు ఆకట్టుకుంది. టీమిండియాను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. అంటే టీమిండియా రన్ రేట్ కనీసం 6 కూడా లేకపోవడం గమనార్హం.

  • 27 Oct 2022 12:57 PM (IST)

    IND vs NED Live Score: రాహుల్ ఔట్..

    టీమిండియాకు ఆదిలోనే తొలి దెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్ 9 పరుగులు చేసి ఎల్బీగా వెనుదిరిగాడు. వాన్ మీకరెన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.

  • 27 Oct 2022 12:34 PM (IST)

    IND vs NED Live Score: నెదర్లాండ్స్ జట్టుతో ఆడితే భారత్ ప్రపంచ కప్ గెలిచినట్లే..

    నెదర్లాండ్స్ జట్టుతో తలపడితే.. టీమిండియా ప్రపంచ కప్ గెలిచినట్లేనని తెలుస్తోంది. ఎందుకంటే.. 2011లో వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో టీమిండియా నెదర్లాండ్స్ జట్టుతో తలపడింది. ఈ క్రమంలో భారత్ వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత ఇప్పుడు తొలిసారి టీ20 ప్రపంచకప్ లో ఇరుజట్లు తొలిసారి ఢీకొంటున్నాయి.

  • 27 Oct 2022 12:30 PM (IST)

    IND vs NED: టీమిండియా జట్టు..

    టాస్ గెలిచిన రోహిత్ సేన మాట్లాడుతూ.. ఒకే జట్టుతో ఈ టోర్నమెంట్ ఆడాలని చూస్తున్నాం. అందుకే టీంలో ఎలాంటి మార్పులు చేయడం లేదు. మా బ్యాటింగ్ మరింత పుంజుకోవాలని, తొలుత బ్యాటింగ్ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు.

    భారత ప్లేయింగ్ XI: KL రాహుల్, రోహిత్ శర్మ(c), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్

  • 27 Oct 2022 12:29 PM (IST)

    నెదర్లాండ్స్ టీం..

    నెదర్లాండ్స్ ప్లేయింగ్ XI: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్‌మాన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), టిమ్ ప్రింగిల్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్

  • 27 Oct 2022 12:27 PM (IST)

    IND vs NED, T20 WC LIVE: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్

    కీలక మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

  • 27 Oct 2022 12:24 PM (IST)

    IND vs NED, T20 WC LIVE: ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం..

    పాకిస్థాన్‌పై బలమైన విజయం సాధించినప్పటికీ, ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత్‌కు చాలా ముఖ్యం. గత మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే.. ఈ జట్టు చాలా డేంజర్‌గా కనిపిస్తోందని, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ని సులువుగా గెలుస్తామని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత జట్టు మాత్రం ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోదు. ఇక్కడ గెలిచేందుకు టీమ్‌ ఇండియా శాయశక్తులా ప్రయత్నిస్తుంది.

  • 27 Oct 2022 12:18 PM (IST)

    IND vs NED Live Score: నేడు సిడ్నీలో వెదర్ రిపోర్ట్..

    సిడ్నీలో జరగనున్న ఈ మైదానానికి వర్షం ముప్పు పొంచి ఉంది. ఈరోజు ఉదయం నుంచి ఎండలు ఎక్కువగా ఉన్న సిడ్నీ వాతావరణం ఇప్పుడు తుఫాను హెచ్చరికలతో వర్షం కురుస్తోంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు చాలా జట్ల ఆటను వర్షం చెడగొట్టింది. ఇప్పుడు టీమిండియా కూడా ఆ బారిన పడే అవకాశం ఉంది.

  • 27 Oct 2022 12:14 PM (IST)

    IND vs NED Live Score: ఈరోజు భారత్ ముందు నెదర్లాండ్స్

    ఈరోజు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. గ్రూప్ 2లోని ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం కానుంది.

Published On - Oct 27,2022 12:12 PM