IPL 2025: సంచలనం.. 6 బంతుల్లో 6 సిక్సులు! స్టార్ బౌలర్‌ను ఉతికేసిన పరాగ్
ఐపీఎల్ 2025లో, కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కేకేఆర్ మరియు రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో, ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. అతను వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి, ప్రత్యర్థి బౌలర్లను షాక్‌కు గురిచేశాడు. మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్లలో ఈ అద్భుతం జరిగింది.

ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ విధ్వంస సృష్టించాడు. ఆరు వరుస బంతుల్లో ఆరు సిక్సులు బాది అదరహో అనిపించాడు. కేకేఆర్ బౌలర్ మొయిన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ తొలి బంతికి ఆర్‌ఆర్ బ్యాటర్ హెట్‌మేయర్ సింగిల్ తీసుకొని రియాన్ పరాగ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు బాదాడు పరాగ్.
ప్రెజర్‌ను తట్టుకోలేక మొయిన్ అలీ వైడ్ వేశాడు. ఆ తర్వాత చివరి బంతికి మరో సిక్స్ బాది. ఆ ఓవర్‌లో మొత్తం ఐదు సిక్సులు బాదేశాడు పరాగ్. వైడ్ ఎలాగో లీగల్ డెలవరీ కాదు కాబట్టి.. అది పరాగ్ అకౌంట్లో రాదు. సో ఐదు బంతుల్లో ఐదు సిక్సులు. ఆ తర్వాత ఓవర్ వేసేందుకు వరుణ్ చక్రవర్తి వచ్చాడు. హెట్‌మేయర్ మళ్లీ సింగిల్ తీసుకొని స్ట్రైక్ పరాగ్‌కు ఇచ్చాడు. అంతే మరో సిక్స్ బాదేశాడు. అలా తాను ఎదుర్కొన్న ఆరు వరుస బంతుల్లో ఆరు సిక్సులు కొట్టేశాడు రియాన్ పరాగ్. ఈ ఆరు సిక్సులు ఒకే ఓవర్‌లో రాకపోయినా.. ఆరు వరుస బంతుల్లో వచ్చాయి.
Riyan Parag has hit six sixes in his last six balls!
📸: JioHotstar pic.twitter.com/RgZiKWSjdc
— CricTracker (@Cricketracker) May 4, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




