AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: 3015.. రోహిత్ శర్మ కొత్త కార్ నంబర్ వెనుక అంత సీక్రెట్ ఉందా.. తెలిస్తే మైండ్ బ్లాంకే

Rohit Sharma Buy New Lamborghini Urus: ఆగస్టులో జరగాల్సిన బంగ్లాదేశ్ సిరీస్ రద్దు కావడంతో టీమిండియా తదుపరి వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి మొదలుకానుంది. ఆస్ట్రేలియాతో విదేశీ సిరీస్ ఆడనుంది. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రోహిత్, కోహ్లీ వన్డేలు ఆడతారా లేదా అనేది ఊహాజనిత విషయం. ఇద్దరు కలిపి 83 వన్డే సెంచరీలు, 25,000 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. అయితే, అక్టోబర్ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కొనసాగగలరా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Rohit Sharma: 3015.. రోహిత్ శర్మ కొత్త కార్ నంబర్ వెనుక అంత సీక్రెట్ ఉందా.. తెలిస్తే మైండ్ బ్లాంకే
Rohit Sharma Buy New Lamborghini Urus
Venkata Chari
|

Updated on: Aug 11, 2025 | 12:18 PM

Share

Rohit Sharma Buy New Lamborghini Urus: రోహిత్ చివరిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా ముంబై ఇండియన్స్ తరఫున పోటీ క్రికెట్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే మ్యాచ్‌లో అతను పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్ అంతర్జాతీయ క్రికెట్‌లో అతని చివరిది కావొచ్చు అని తెలుస్తోంది.

ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ ల వన్డే భవిష్యత్తు గురించి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కానీ భారత క్రికెట్ బోర్డులోని నిర్ణయాధికారులను బట్టి చూస్తే, ఇద్దరు దిగ్గజాలపై వెంటనే నిర్ణయం తీసుకోవడానికి తొందరపడాల్సిన అవసరం లేదన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కార్ల కలెక్షన్‌లో కొత్తగా లంబోర్ఘిని ఊరుస్ ఎస్‌ఈని చేర్చారు. ఆరెంజ్ రంగులో ఉన్న ఈ కారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ‘3015’పైనే అందరి దృష్టి పడింది. గతంలో రోహిత్ శర్మ కారు నెంబర్ ‘264’. అది ఆయన వన్డేల్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. అయితే, ఇప్పుడు ఈ కొత్త నెంబర్ వెనుక ఉన్న కథ అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

‘3015’ నెంబర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, ఇది రోహిత్ శర్మ పిల్లలైన సమైరా, అహాన్ పుట్టినరోజు తేదీలను సూచిస్తుంది. మొదటి రెండు అంకెలు ’30’ రోహిత్ కుమార్తె సమైరా పుట్టినరోజు (డిసెంబర్ 30)ని సూచిస్తాయి. ఆ తర్వాత ’15’ అతని కుమారుడు అహాన్ పుట్టినరోజు (నవంబర్ 15)ని సూచిస్తుంది.

ఇంతేకాకుండా, ఈ రెండు అంకెలను కలిపితే ’30+15=45′ అవుతుంది. ఇది రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45. ఈ ప్రత్యేక నెంబర్ ఎంపిక ద్వారా, రోహిత్ తన కుటుంబం, వృత్తి జీవితం మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని ప్రదర్శించారు.

రోహిత్ శర్మ తన పాత లంబోర్ఘిని ఊరుస్ కారును డ్రీమ్11 పోటీ విజేతకు బహుమతిగా ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఈ కొత్త కారును కొనుగోలు చేశారు. ఈ కొత్త కారు ధర దాదాపు రూ. 4.57 కోట్లు ఉంటుందని అంచనా. ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీ 800hp, 950Nm టార్క్, కేవలం 3.4 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు రోహిత్ శర్మ అభిమానులను, కారు ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..