AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్.. ఇంగ్లండ్‌లో ఇదెక్కడి అరాచకం మావా..!

England U19 vs India U19, 1st Youth Test: తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో విఫలమైన వైభ‌వ్ సూర్య‌వంశీ.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 56 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనే బౌలింగ్‌తో ఎలాంటి మాయజాలం చేస్తాడో చూడాలి.

IND vs ENG: ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్.. ఇంగ్లండ్‌లో ఇదెక్కడి అరాచకం మావా..!
Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: Jul 15, 2025 | 5:25 PM

Share

Vaibhav Suryavanshi: యువ క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనానికి తెరలేపిన భారత అండర్-19 యువ స్పిన్నర్ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్‌లో సంచలనాలకు మారుపేరుగా నిలిచాడు. బెక‌న్‌హామ్ వేదిక‌గా ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరుగుతోన్న తొలి యూత్ టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లను ఉక్కిరిబిక్కిరి చేసిన వైభవ్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ స్పెషల్ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే, మొద‌టి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైన ఈ ఐపీఎల్ సెన్సేషన్.. బౌలింగ్‌లో టాప్ లేపాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వైభ‌వ్ తన ఖాతాలో రెండు కీలక వికెట్లు లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌ హంజా షేక్(84),థామస్ రెవ్(34) వికెట్లను కీలక సమయంలో పడగొట్టి భారత జట్టుకు ఆధిక్యం వచ్చేలా చేశాడు.

వైభవ్ అరుదైన రికార్డ్..

ఈ 14 ఏళ్ల టీమిండియా చిచ్చర పిడుగు బౌలింగ్‌లో రెచ్చిపోవడంతో.. ఓ అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతి పిన్న వయసులో ఓ యూత్ టెస్టు మ్యాచ్‌లో వికెట్ సాధించి రికార్డు సృష్టించడం గమనార్హం. గతంలో ఈ రికార్డు కూడా ఓ భారతీయుడి పేరుతోనే ఉంది. భార‌త అండ‌ర్‌-19 క్రికెట‌ర్ మ‌నిషీ (15) తొలిసారి ఈ లిస్ట్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌తో మ‌నిషీ రికార్డును వైభ‌వ్ సూర్యవంశీ బ్రేక్ చేయడం విశేషం.

ప్రస్తుతం మ్యాచ్ పరిస్థితి..

4వ రోజుకు చేరిన ఈ అండ‌ర్‌-19 తొలి యూత్ టెస్టులో ప్రస్తుతం భారత్ తన రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో మొత్తంగా భారత్ 290 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో వైభవ్ 56 పరుగులు, ఆయుష్ మాత్రే 32, మల్హోత్రా 63 పరుగులు చేయగా, మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 540 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టు 439 పరుగులు చేసింది.

తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా, రెండో ఇన్నింగ్స్‌లో ఫిఫ్టీ..

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో విఫలమైన వైభ‌వ్ సూర్య‌వంశీ.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 56 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనే బౌలింగ్‌తో ఎలాంటి మాయజాలం చేస్తాడో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే