AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : ఆ టూర్‌కు వస్తా.. నాలుగైదు సెంచరీలు బాదేస్తా.. కట్‌చేస్తే.. లాస్ట్ మినిట్‌లో కోహ్లీ డెసిషన్ ఛేంజ్.. ఎందుకంటే?

విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ గురించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇంగ్లాండ్ టూర్‌లో రాణించాలని ఆయన ప్లాన్ చేసుకున్నారని ఢిల్లీ రంజీ కోచ్ శరణ్‌దీప్ సింగ్ వెల్లడించారు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Virat Kohli : ఆ టూర్‌కు వస్తా.. నాలుగైదు సెంచరీలు బాదేస్తా.. కట్‌చేస్తే.. లాస్ట్ మినిట్‌లో కోహ్లీ డెసిషన్ ఛేంజ్.. ఎందుకంటే?
Virat Kohli
Rakesh
|

Updated on: Jul 15, 2025 | 4:54 PM

Share

Virat Kohli : లార్డ్స్ టెస్ట్‌లో 22 పరుగుల తేడాతో గెలిచి ఇంగ్లాండ్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్‌లోని రెండో టెస్ట్‌లో భారత్ 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచే అవకాశాలు భారత్‌కు వచ్చినా కొన్ని పొరపాట్ల వల్ల ఓటమి చవిచూసింది. ఈ సిరీస్‌లో కొంతమంది భారత బ్యాట్స్‌మెన్ మాత్రమే రాణించారు. మరికొందరు అవకాశాలు వచ్చినా చేజేతులా పాడు చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితులలో, జట్టుకు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడి విజయాన్ని తీసుకురావడంలో విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, ఈ సిరీస్ మొదలు కావడానికి కొన్ని వారాల ముందు, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వాస్తవానికి కోహ్లీ ఈ సిరీస్ కోసం తనను తాను ముందే రెడీ చేసుకున్నాడట. ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తు చేయాలని ప్లాన్లు కూడా వేసుకున్నాడట. మరి సడెన్‌గా సిరీస్‌కు ముందే రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం.

కొన్ని వారాల క్రితం, ఢిల్లీ రంజీ క్రికెట్ జట్టు కోచ్ శరణ్‌దీప్ సింగ్ ఒక కీలక విషయాన్ని బయటపెట్టారు. ఆస్ట్రేలియా టూర్‌లోని ఫెయిల్యూర్స్ తర్వాత విరాట్ ఇంగ్లాండ్‌లో అద్భుతంగా రాణించాలని భావించారని ఆయన చెప్పారు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు కోహ్లీ రెడ్-బాల్తో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారని, ఈ సిరీస్ ప్రారంభమయ్యే ముందు ఇండియా-ఎ జట్టు తరపున ఆడాలని కూడా ప్లాన్ చేసుకున్నారని సింగ్ తెలిపారు. ఇంగ్లాండ్ టూర్‌లో మూడు నుంచి నాలుగు సెంచరీలు సాధించాలని విరాట్ లక్ష్యంగా పెట్టుకున్నారని శరణ్‌దీప్ సింగ్ వెల్లడించారు.

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, అతని ఫామ్ తగ్గడం, కుటుంబంతో గడపడానికి సమయం కేటాయించడం వంటి కారణాలు అతని రిటైర్మెంట్‌కు దారితీసి ఉండవచ్చని చాలామంది భావిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పుడు అతను కేవలం వన్డే మ్యాచ్‌లలో మాత్రమే ఆడనున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..