R Ashwin: ఐసీసీ వన్డే ప్రపంచకప్ జట్టులోకి అశ్విన్ ఎంట్రీ.. టీమిండియా ఫైనల్ స్వ్కాడ్‌పై ఉత్కంఠ..
Team India ICC World Cup 2023 Squad: అక్షర్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ, ఫిట్‌నెస్ షరతులతో అన్నది గుర్తించాల్సిన విషయం. ఇప్పుడు గాయం కారణంగా అక్షర్ ఈ సిరీస్‌లోని మూడో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో ప్రపంచకప్‌నకు ముందు ఫిట్‌నెస్ నిరూపించుకునే అవకాశాన్ని అక్షర్ కోల్పోయాడు. ఇప్పుడు అక్షర్ వరల్డ్ కప్ నుంచి కూడా ఔట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

Indian Cricket Team: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 కోసం టీమిండియాను సెప్టెంబర్ 5న ప్రకటించారు. ఆసియా కప్ జట్టులోని ఆటగాళ్లకు మాత్రమే ప్రపంచకప్‌కు అవకాశం కల్పించారు. వెటరన్, 2011 ప్రపంచకప్ విజేత ఆర్ అశ్విన్‌కు ప్రపంచకప్ ఆడే అవకాశం ఇవ్వలేదు. ఇది చాలా మంది క్రికెట్ అభిమానులనే కాదు.. మాజీలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అశ్విన్‌కు అవకాశం ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని నెటిజన్లు ఖండించారు. భారత్‌లో ప్రపంచకప్ ఉన్నప్పటికీ అశ్విన్‌లాంటి అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా సెలక్షన్ కమిటీని ప్రశ్నించారు.
కాగా, ప్రస్తుతం కనిపిస్తున్న మార్పులను గమనిస్తే.. ప్రపంచకప్ కోసం సెప్టెంబర్ 27 వరకు జట్టును మార్చే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అక్షర్ ప్రపంచకప్ జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే, ప్రపంచకప్‌నకు ముందు ఆసియా కప్ సూపర్ 4 రౌండ్‌లో అక్షర్ గాయపడ్డాడు. ఈ గాయం కారణంగా అక్షర్‌కు ఆసియా కప్ ఫైనల్‌లో కూడా అవకాశం లభించలేదు. అందుకే, అదే సమయంలో భారత్ నుంచి ఫైనల్ మ్యాచ్ కోసం వాషింగ్టన్ సుందర్ శ్రీలంక వెళ్లాల్సి వచ్చింది.




అక్షర్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ, ఫిట్‌నెస్ షరతులతో అన్నది గుర్తించాల్సిన విషయం. ఇప్పుడు గాయం కారణంగా అక్షర్ ఈ సిరీస్‌లోని మూడో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో ప్రపంచకప్‌నకు ముందు ఫిట్‌నెస్ నిరూపించుకునే అవకాశాన్ని అక్షర్ కోల్పోయాడు. ఇప్పుడు అక్షర్ వరల్డ్ కప్ నుంచి కూడా ఔట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. గాయం నుంచి అక్షర్ కోలుకోలేదని అంటున్నారు. ప్రపంచకప్ కోసం జట్టులో అనధికారిక మార్పులు చేయడానికి కూడా కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి.
View this post on Instagram
కాబట్టి, అక్షర్‌ను ఏం చేయాలో కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ నిర్ణయించాల్సి ఉంది. ఇప్పుడు సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. అయితే అశ్విన్‌ను ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేస్తారని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది.
ప్రపంచ కప్ 2023 కోసం టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
