MI vs RCB 1st Innings Highlights: హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన మాక్స్‌వెల్, డు ప్లెసిస్.. ముంబై ముందు భారీ టార్గెట్..
Mumbai Indians vs Royal Challengers Bangalore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో 54వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది.
Mumbai Indians vs Royal Challengers Bangalore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో 54వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. దీంతో ముంబై ముందు 200 పరుగుల టార్గెట్ నిలిచింది. 30 పరుగుల వద్ద దినేష్ కార్తీక్ ఔటయ్యాడు. క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో వధేరా చేతికి చిక్కాడు. అంతకుముందు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (41 బంతుల్లో 65) కెమరూన్ గ్రీన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
గ్లెన్ మాక్స్‌వెల్ (33 బంతుల్లో 68), అనుజ్ రావత్ (6 పరుగులు), విరాట్ కోహ్లీ (ఒక పరుగు)లకు జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో మహిపాల్ లోమ్రోర్ (1 పరుగు) అవుటయ్యాడు.
ముంబైకి చెందిన జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 3 వికెట్లు తీశాడు. కెమరూన్ గ్రీన్, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తికేయలకు ఒక్కో వికెట్ దక్కింది.
ఇరు జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండోర్ఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..