Video: బుమ్రా అహాన్ని దెబ్బతీసిన నాయర్.. కట్‌చేస్తే మైదానంలో గొడవ.. రోహిత్ ఎక్స్‌ప్రెషన్స్ నెక్ట్స్ లెవల్
Jasprit Bumrah fight with Karun Nair: ఐపీఎల్ 2025లో గాయం తర్వాత తిరిగి వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా ప్రత్యేకంగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తాజాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కరుణ్ నాయర్ దెబ్బకు సహనం కోల్పోయిన బుమ్రా.. మైదానం మధ్యలో గొడవపడ్డాడు.

Jasprit Bumrah fight with Karun Nair: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 29వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) 4 విజయాల తర్వాత తొలి ఓటమిని చవి చూసింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఎన్నో ఊహించని సంఘటలను చోటు చేసుకున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ (MI) 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తం 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఈ సీజన్‌లో డీసీకి ఇది తొలి ఓటమి. మ్యాచ్ సమయంలో ఓ గొడవ కూడా చోటు చేసుకుంది. ఎంఐ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మైదానం మధ్యలో ఢిల్లీ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్‌తో గొడవకు దిగాడు. ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాడు.
గాయం తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, అతను ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. బుమ్రా ఓవర్లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్స్ పరుగుల వర్షం కురిపించారు. కరుణ్ నాయర్ చాలా కాలం తర్వాత అంటే దాదాపు 7 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఆడుతున్నాడు. రీఎంట్రీలోనే తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. ఈ సమయంలో బుమ్రా బౌలింగ్‌ను చిత్తు చేశాడు.
బుమ్రా కరుణ్ నాయర్ తో ఎందుకు గొడవ పడ్డాడు?
The average Delhi vs Mumbai debate in comments section 🫣
Don’t miss @ImRo45 ‘s reaction at the end 😁
Watch the LIVE action ➡ https://t.co/QAuja88phU#IPLonJioStar 👉 #DCvMI | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/FPt0XeYaqS
— Star Sports (@StarSportsIndia) April 13, 2025
లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్ల వర్షం కురిపించాడు. దీంతో కోపంగా ఉన్న బుమ్రా మైదానం మధ్యలో నాయర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత, కరుణ్ నాయర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఫిర్యాదు చేశాడు. పాండ్య నాయర్‌కు సమస్యను వివరించి పరిష్కరించాడు. ఈ సమయంలో రోహిత్ శర్మ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే కచ్చితంగా నవ్వాల్సిందే.
ఇది కూడా చదవండి: IPL 2025: ఐపీఎల్ హిస్టరీలో చెత్త ఓపెనర్.. సగటు చూస్తే చిరాకే.. ఇకపై కొనడం కష్టమే?
గాయం తర్వాత బుమ్రా రీఎంట్రీ..
గాయం తర్వాత, జస్‌ప్రీత్ బుమ్రా ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ, అతను ప్రత్యేకంగా ఏం చేయలేకపోయాడు. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చాడు. కానీ, ఎటువంటి వికెట్ దక్కించుకోలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ చిత్తుగా దాడి చేశాడు. దీంతో బుమ్రా కోపంగా కనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ 40 బంతుల్లో 5 సిక్సర్లు, 12 ఫోర్లతో 89 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఘోరంగా విఫలమయ్యాడు. అందుకే అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీని ఫలితంగా బుమ్రా మైదానం మధ్యలో కరుణ్ నాయర్‌తో గొడవకు దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..