AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi: వివాదంలో వైభవ్ సూర్యవంశీ.. ఏకిపారేస్తోన్న కోహ్లీ ఫ్యాన్స్.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Vaibhav Suryavanshi 18 Number Jersey: వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే, 14 ఏళ్ల ఈ యువ సంచలనం ఇటీవల ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అదరగొట్టి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో 44 బంతుల్లో 56 పరుగులు చేసి తన సత్తాను చాటాడు.

Vaibhav Suryavanshi: వివాదంలో వైభవ్ సూర్యవంశీ.. ఏకిపారేస్తోన్న కోహ్లీ ఫ్యాన్స్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
Vaibhav Suryavanshi 18 Number Jersey
Venkata Chari
|

Updated on: Jul 18, 2025 | 9:34 PM

Share

Vaibhav Suryavanshi 18 Number Jersey: టీమిండియా యువ సంచలనం, అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి అత్యంత ఇష్టమైన 18వ నంబర్ జెర్సీని ధరించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ విషయంపై క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివాదానికి కారణం ఏమిటి?

వైభవ్ సూర్యవంశీ U19 జట్టు తరపున ఆడుతున్నప్పటికీ, అతను ధరించిన జెర్సీ నంబర్ 18 కావడంతో ఈ చర్చ మొదలైంది. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో నంబర్ 18 జెర్సీ ధరించి ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ రిటైర్ అయినప్పటికీ, ఈ జెర్సీ నంబర్ ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు. అందుకే అభిమానులు ఈ నంబర్‌ను మరెవరూ ధరించకూడదని, కనీసం కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యే వరకు దానిని ఎవ్వరికీ కేటాయించ వద్దని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బీసీసీఐ వివరణ, అభిమానుల స్పందన..

బీసీసీఐ అధికారులు ఈ విషయంపై స్పందిస్తూ, “ఇండియా ‘ఏ’ జట్లలో లేదా లిస్ట్ ‘ఏ’ క్రికెట్‌లో ఆటగాళ్ళకు జెర్సీ నంబర్లు కేటాయించరని, ఎవరైనా తమకు నచ్చిన నంబర్‌ను ఎంచుకోవచ్చని” తెలిపారు. జెర్సీ నంబర్లు కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమని వారు పేర్కొన్నారు. అయితే, ఈ వివరణతో అభిమానులు సంతృప్తి చెందడం లేదు. టెస్ట్ మ్యాచ్‌ల జెర్సీలకు నంబర్లు ఉండవని చాలా మందికి తెలుసు. కానీ, ప్రస్తుత U19 టెస్ట్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 18 నంబర్ జెర్సీ ధరించడం వివాదానికి దారి తీసింది. అభిమానుల అభిప్రాయం ప్రకారం, కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడి జెర్సీ నంబర్‌ను అండర్-19 స్థాయిలో కూడా మరెవరూ ధరించకూడదని, ఇది కోహ్లీ వారసత్వానికి అగౌరవమని వారు భావిస్తున్నారు. 10వ నంబర్ జెర్సీని సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత బీసీసీఐ అనధికారికంగా రిటైర్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన..

వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే, 14 ఏళ్ల ఈ యువ సంచలనం ఇటీవల ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అదరగొట్టి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో 44 బంతుల్లో 56 పరుగులు చేసి తన సత్తాను చాటాడు. అలాగే, బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి యూత్ టెస్ట్‌లో వికెట్ సాధించిన అతిపిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై ఎవరికీ సందేహం లేదు. అతను భారత క్రికెట్ భవిష్యత్తుకు ఆశాకిరణం. అయితే, జెర్సీ నంబర్ 18 వివాదం అభిమానుల మనోభావాలకు సంబంధించినది. బీసీసీఐ ఈ విషయంలో అభిమానుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..