HCA: హెచ్‌సీఏ జనరల్ బాడీ మీటింగ్‌పై ఉత్కంఠ… అడ్డుకుని తీరతామంటున్న టీసీఏ.. భారీగా పోలీసుల మోహరింపు
ఇవాళ హెచ్‌సీఏ ఆఫీస్‌లో వార్షిక మీటింగ్ ఏర్పాటు చేశారు. యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. హెచ్‌సీఏలో అంబుడ్స్ మెన్, ఎథిక్స్ ఆఫీసర్ ఏర్పాటు చేయాలని మీటింగ్ అజెండాగా పెట్టుకున్నారు. సమావేశంలో వివిధ క్లబ్బుల అధ్యక్షులు, సెక్రటరీలు పాల్గొననున్నారు. అయితే మీటింగ్‌కి ఎంతమంది...

ఇవాళ హెచ్‌సీఏ ఆఫీస్‌లో వార్షిక మీటింగ్ ఏర్పాటు చేశారు. యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. హెచ్‌సీఏలో అంబుడ్స్ మెన్, ఎథిక్స్ ఆఫీసర్ ఏర్పాటు చేయాలని మీటింగ్ అజెండాగా పెట్టుకున్నారు. సమావేశంలో వివిధ క్లబ్బుల అధ్యక్షులు, సెక్రటరీలు పాల్గొననున్నారు. అయితే మీటింగ్‌కి ఎంతమంది హాజరవుతారనేదిపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ చర్యల నుంచి తప్పించుకునేందుకు హడావుడిగా మీటింగ్ అంటున్నాయి CAT, TCA. చర్చించే అంశాలు ఏంటి? మినిట్స్‌లో ఏం రాశారు.. ఇవన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. మీటింగ్‌ను అడ్డుకుంటామంటూ తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. HCA మీటింగ్‌ను మాజీ క్రికెటర్లు అడ్డుకునే అవకాశం ఉంది. దీంతో స్టేడియం దగ్గర ఉప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పీకల్లోతు అవినీతి అక్రమాల్లో కురుకుపోయారు. ఈ క్రమంలో ప్రస్తుతం అధ్యక్షుడిని నేనంటే నేను అంటూ పోటీలు పడుతున్న వాతావరణం నెలకొంది. ఇప్పటిదాకా అవినీతి ఇన్నింగ్స్ ఆడినవాళ్లే మళ్లీ కుర్చీనెక్కడానికి పోటీకొస్తున్నారు. హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, అవకతవకలపై విచారణ స్పీడ్ పెంచడంతో హెచ్‌సీఎ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్‌లోకి దిగితే పరిస్థితి చెయ్యిదాటిపోతుందని బెంబేలెత్తి… తదుపరి చర్యలపై దృష్టి పెట్టింది.
ఇవాళ ఉప్పల్ స్టేడియంలోని హెచ్‌సీఏ కార్యాలయంలో యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏర్పాటు చేశారు యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్. హెచ్‌సీఏలో అంబుడ్స్ మెన్, ఎథిక్స్ ఆఫీసర్‌ని నియమించడమే మీటింగ్ ఎజెండా. కానీ… ఈ మీటింగే చెల్లదన్న వాదన ఒకటుంది. గత నెల 29న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఏమేం చర్చించారు? మినిట్స్ లో ఏం రాశారు.. అన్నీ బయటపెట్టాలన్న డిమాండ్లొస్తున్నాయి.
కోరం లేకుండా నాలుగు రోజులు కిందట మీటింగ్ పెట్టి దల్జిత్ సింగ్ తనను తానే ప్రెసిడెంట్‌గా ప్రకటించుకోవడం ఏంటనే ప్రశ్నలొస్తున్నాయి. అందుకే… ఇవాళ జరగబోయే HCA మీటింగ్‌ను మాజీ క్రికెటర్లు, క్రికెట్ సంఘాలు అడ్డుకునే అవకాశం ఉంది.
మరోవైపు HCA అక్రమాల కేసులో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. HCA నిందితుల రెండో రోజు కస్టడీలో భాగంగా సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం ఏ1 నిందితుడు జగన్ మోహన్ రావును ఉప్పల్ స్టేడియంకు తీసుకెళ్లారు సీఐడీ అధికారులు. ఈ కేసులో కీలకమైన ఆధారాలను గుర్తించేందుకు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. HCA ఆఫీసు, శ్రీచక్ర క్లబ్, జగన్‌మోహన్ ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి.




