AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: టీమిండియాలోకి ఎస్ఆర్‌హెచ్ డ్యాషింగ్ ఓపెనర్.. ఆ సీనియర్ ప్లేయర్‌కు డేంజర్ బెల్ మోగినట్లే!

IPL 2024 సీజన్‌ లో ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం ( మే 26) నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ కూడా ముగుస్తుంది. దీని తర్వాత T20 ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.

IPL 2024: టీమిండియాలోకి ఎస్ఆర్‌హెచ్ డ్యాషింగ్ ఓపెనర్.. ఆ సీనియర్ ప్లేయర్‌కు డేంజర్ బెల్ మోగినట్లే!
Abhishek Sharma
Basha Shek
|

Updated on: May 25, 2024 | 9:55 PM

Share

IPL 2024 సీజన్‌ లో ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం ( మే 26) నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ కూడా ముగుస్తుంది. దీని తర్వాత T20 ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే మే 26న జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్‌లో ఫైనల్‌ ఆడనున్న భారత ప్రపంచకప్‌ జట్టులో ఏ ఆటగాడు లేకపోవడం కూడా విచిత్రం. కాగా టీ 20 ప్రపంచకప్‌ లో చోటు దక్కించుకోనప్పటికీ కొంతమంది ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించారు. అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మ ముందుంటాడు. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆల్ రౌండర్ అభిషేక్ గత 5 సీజన్‌లుగా ఐపీఎల్‌లో భాగమయ్యాడు, కానీ ఎప్పుడూ పూర్తి స్థాయిలో రాణించలేకపోయాడు. అప్పుడప్పుడు కొన్ని మెరుపులు కనిపించినా పూర్తి సామర్ మేరకు మాత్రం ఆడలేదు. అయితే ఐపీఎల్ 2024లో అభిషేక్ ఎట్టకేలకు ఆ పనిని పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో బాగా ఆకట్టుకున్న యువ ఆటగాళ్లలో అభిషేక్ ఒకడు.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో ఆ జట్టు ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ప్రధాన పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి చాలా మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లను చిత్తు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో హెడ్ ఇప్పటికీ అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు కానీ అభిషేక్ ప్రదర్శన మరింత ఆకట్టుకుంది. అభిషేక్ ఇప్పటివరకు 15 ఇన్నింగ్స్‌లలో 482 పరుగులు చేశాడు, ఇందులో అతని స్ట్రైక్ రేట్ 207. టోర్నీలో 400 కంటే ఎక్కువ పరుగులు చేసిన 18 మంది బ్యాటర్లలో అభిషేక్ స్ట్రైక్ రేటే అత్యధికం కావడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనప్పటికీ టీ20 ప్రపంచకప్‌లో జట్టులో అభిషేక్ ను తీసుకు రావాలనే డిమాండ్ వచ్చింది. అయితే అదేమీ జరగలేదు. కానీ వరల్డ్ కప్ తర్వాత ఏదైనా టీ20 సిరీస్‌లో అతనికి టీమ్ ఇండియాలో అవకాశం రావడం ఖాయంగా కనిపిస్తోంది.

జడేజా స్థానానికి ఎసరు..

ఇది మాత్రమే కాదు, ఇప్పుడు అభిషేక్ టీమ్ ఇండియా దిగ్గజ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్థానానికి ఎసరు పెట్టేలా ఎదిగాడు. ఎందుకంటే బ్యాటింగ్ తో పాటు అభిషేక్ బౌలింగ్‌లో తన మ్యాజిక్ చూపించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో అభిషేక్ తన స్పిన్‌తో 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ని మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషించాడు. జడేజా చాలా కాలంగా టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు, అయితే గత కొంతకాలంగా, ముఖ్యంగా T20, ODI క్రికెట్‌లో, అతని ప్రదర్శన అంచనాలు, అవసరాలకు అనుగుణంగా లేదు. అటువంటి పరిస్థితిలో, టీమ్ ఇండియా జడేజాకు రీప్లేస్‌మెంట్ ను కనుగొనాల్సి ఉంది. అభిషేక్ ఇందుకు సరైన ప్రత్యామ్నాయమని, జడేజా లేని లోటును అతను రిగ్గా భర్తీ చేయగలడని అభిమానులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..