AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: మొన్న కోహ్లీ.. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా.. జరిమానా పడే ఛాన్స్.. ఎందుకంటే?

Jasprit Bumrah May be Fined: సిడ్నీ టెస్టు తొలిరోజు తీవ్ర గందరగోళం నెలకొంది. వాషింగ్టన్ సుందర్ ఔట్ అయినప్పుడు అంపైరింగ్‌పై ప్రశ్నల వర్షం కురిసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు కెప్టెన్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ నిర్ణయంతో విభేదించాడు. దీంతో జరిమానా ముప్పును ఎదుర్కొంటున్నాడు. మరి ఈ విషయంలో అంపైర్లు ఎలాంటి శిక్ష విధిస్తారో చూడాలి.

IND vs AUS: మొన్న కోహ్లీ.. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా.. జరిమానా పడే ఛాన్స్.. ఎందుకంటే?
Jasprit Bumrha Fine
Venkata Chari
|

Updated on: Jan 04, 2025 | 10:48 AM

Share

Jasprit Bumrah May be Fined: మెల్‌బోర్న్ టెస్టు సందర్భంగా భారత జట్టు వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. సామ్ కాన్‌స్టాస్‌కు గట్టిగా భుజాన్ని తగిలించిన విషయంపై కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం తీసివేశారు. తాజాగా మరో టీమిండియా స్టార్ ప్లేయర్‌పైనా ఐసీసీ జరిమానా విధించినున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత జట్టు అత్యంత డేంజరస్, విజయవంతమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై కూడా అలాంటి ముప్పు పొంచి ఉంది. కాన్స్టాస్‌తో బుమ్రా వాగ్వాదానికి దిగినప్పటికీ, అతనికి జరిమానా విధించడం వెనుక కారణం వేరే ఉంది. నిజానికి, అతను భారత ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్‌ను అవుట్ చేసినందుకు అంపైరింగ్‌పైనే ప్రశ్నలు లేవనెత్తాడు. దీంతో ఐసీసీ ఈ తప్పుకు శిక్షను విధించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

నియమం ఏమి చెబుతుంది?

ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్లపై చర్యలు తీసుకునేందుకు కొన్ని హక్కులు కల్పించారు. ఒక ఆటగాడు ఇలాంటి చర్యకు పాల్పడితే, అది సహించలేనిదని వారు భావిస్తే, వారు చర్య తీసుకోవచ్చు. దీని కింద లెవల్ 1, లెవల్ 2, లెవల్ 3, లెవల్ 4 తప్పులుగా విభజించుకునే ఛాన్స్ ఉంది.. బుమ్రా లేవనెత్తిన ప్రశ్నలు లెవల్ 1 నేరం కిందకు వస్తాయి.

ఆటగాళ్ళు ఏదైనా చెప్పడం ద్వారా లేదా ఏదైనా చర్య ద్వారా అంపైర్ నిర్ణయంతో తమ అసమ్మతిని వ్యక్తం చేస్తే, వారు దోషులుగా పరిగణించబడతారు. వాషింగ్టన్ సుందర్‌కు థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చిన తర్వాత బుమ్రా కూడా ‘గత గేమ్‌లో స్నిక్‌తో ఔట్ కాలేదని, ఇప్పుడు ఔట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. అయితే, అంపైర్లు దీనిని ఎలా చూస్తారు? జరిమానా విధిస్తారా లేదా అనేది ఇప్పుడు చూడాలి.

ఇవి కూడా చదవండి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వివాదస్పద నిర్ణయాలు..

టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో కష్ట సమయాల్లో ఉన్నప్పుడు, జట్టుకు వాషింగ్టన్ సుందర్ చాలా అవసరం. అయితే, సుందర్ వివాదాస్పద నిర్ణయానికి గురయ్యాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన బంతికి సుందర్ వికెట్ కీపర్ అలెక్స్ కారీకి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత, ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో, ఆస్ట్రేలియా DRS ను ఉపయోగించింది. విషయం టీవీ అంపైర్‌కు చేరింది. స్నికో మీటర్‌లో కదలిక కనిపించింది. అయితే ఫ్రేమ్ మారిన వెంటనే టచ్ ఏం కనిపించలేదు.

అంటే, కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ, థర్డ్ అంపైర్ ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చి అతడిని ఔట్ చేశాడు. దీనికి ముందు, మెల్‌బోర్న్ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ వికెట్‌పై సందడి నెలకొంది. అతని విషయంలో స్నికో మీటర్‌పై కదలిక లేనప్పటికీ నిర్ణయం మార్చడంపై వివాదం నెలకొంది. పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి గురయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..