స్వ్కాడ్‌లో లక్కీఛాన్స్.. కట్‌చేస్తే.. ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. ఈ నలుగురు వాటర్ బాయ్స్‌గా ఫిక్స్..?
T20 World Cup 2026: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ తన డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలని చూస్తోంది. స్వదేశంతోపాటు శ్రీలంకలో ఈ టోర్నీ జరగనుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అయితే ప్రతిభావంతులైన ఈ నలుగురు ఆటగాళ్లకు అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి.

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టును ఇటీవలే ప్రకటించారు. ముంబైలో జరిగిన సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ కార్యదర్శి, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమక్షంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఖరారు చేశారు. అయితే, ఈ జట్టులో ఎంపికైన నలుగురు కీలక ఆటగాళ్లకు ప్లేయింగ్ ఎలెవన్ (తుది జట్టు)లో చోటు దక్కడం కష్టమని, వారు కేవలం బెంచ్‌కే పరిమితం కానున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాల ప్రకారం, ఈ నలుగురు ఆటగాళ్లు టోర్నీ మొత్తం మైదానంలో ఉన్న ఆటగాళ్లకు నీళ్లు అందించే ‘డ్రింక్ బాయ్స్’గా మాత్రమే కనిపిస్తారని సమాచారం. ఆ నలుగురు ఆటగాళ్లు ఎవరంటే:
1. హర్షిత్ రాణా: గౌతమ్ గంభీర్‌కు అత్యంత ఇష్టమైన ఆటగాళ్లలో హర్షిత్ రాణా ఒకరు. అయినప్పటికీ, తుది జట్టులో అతనికి చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ప్రధాన పేసర్లుగా ఉంటారు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివం దూబే వేగంగా బౌలింగ్ చేయగలరు. ఈ సమీకరణాల వల్ల హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.
2. ఇషాన్ కిషన్: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమ్ ఇండియాలోకి ఇషాన్ కిషన్ పునరాగమనం చేశాడు. దేశవాళీ క్రికెట్ (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ)లో అద్భుతంగా రాణించినప్పటికీ, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉండటంతో ఇషాన్ కిషన్‌కు అవకాశం రాకపోవచ్చు.
3. రింకూ సింగ్: టీమ్ ఇండియా ఫినిషర్ అయిన రింకూ సింగ్‌కు ఈసారి తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగానే ఉంది. అతని స్థానంలో శివం దూబేను ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే దూబే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు, ఇది జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుంది.
4. వాషింగ్టన్ సుందర్: స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్ కంటే అక్షర్ పటేల్‌కే కోచ్ గంభీర్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అక్షర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషించగలడు కాబట్టి, సుందర్ కేవలం రిజర్వ్ ప్లేయర్‌గానే ఉండాల్సి రావచ్చు.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (కీపర్), అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (కీపర్), రింకూ సింగ్.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ తన డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలని చూస్తోంది. స్వదేశంతోపాటు శ్రీలంకలో ఈ టోర్నీ జరగనుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అయితే ప్రతిభావంతులైన ఈ నలుగురు ఆటగాళ్లకు అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




