IND vs ENG 3rd T20I: టాస్ గెలిచిన భారత్.. రీఎంట్రీ ఇచ్చిన షమీ.. ఎవరు తప్పుకున్నారంటే?
India vs England, 3rd T20I: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు రాజ్‌కోట్ వేదికగా మూడో టీ20 జరగనుంది. నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఒక మార్పు వచ్చింది. ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ స్థానంలో మహమ్మద్ షమీని చేర్చారు. ఇంగ్లాండ్ తన ప్లేయింగ్-11ని సోమవారం నాడు విడుదల చేసింది. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

14 నెలల తర్వాత రీఎంట్రీ..
షమీ 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అతను 19 నవంబర్ 2023న వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఎట్టకేలకు షమీ ఫిట్ నెస్‌పై వస్తోన్న వార్తలకు చెక్ పడినట్లేనని తెలుస్తోంది.
రెండు జట్ల ప్లేయింగ్-11..
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టన్, జేమీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
🚨 Team News
Mohd. Shami picked in the Playing XI as #TeamIndia make 1⃣ change to the line-up 🔽
Updates ▶️ https://t.co/amaTrbtzzJ#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/zKTKBk8yL3
— BCCI (@BCCI) January 28, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..