Cinema : గుండె ఆగిపోయే ఉత్కంఠ.. మెంటలెక్కించే ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న ఈ సినిమా చూశారా.. ?
ప్రస్తుతం ఓటీటీలో విభిన్న కంటెంట్ చిత్రాలకు మంచి వస్తుంది. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు మీకోసం ఓ సినిమాను తీసుకువచ్చాం. ఇంతకీ ఈ సినిమా పేరెంటీ..? కథేంటీ ? తెలుసుకుందామా.

ప్రస్తుతం ఓటీటీలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. థియేటర్లకు సినిమాలు చేసేవారి కంటే ఇప్పుడు ఓటీటీలో మూవీస్ చూసే జనాల సంఖ్య మరింత పెరిగిందే. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా గురించి తెలుసుకుందామా. అందరు మనషులు ఏదో ఒక విధంగా స్వార్థపరులే. తాము కోరుకున్నది పొందడానికి ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటారు. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, స్వార్థపరులు మంచివారైనప్పుడు ఏమి జరుగుతుందో చెప్పే సినిమా ఇది. ఆ సినిమా పేరు కుట్రం పురిందవన్ (Kuttram Purindhavan: The Guilty One (2025). ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : తనూజ చెవిలో శ్రీముఖి ఏం చెప్పింది.. ? ఏం లీక్ చేసింది భయ్యా.. నెటిజన్స్ ఆగ్రహం…
రిటైర్డ్ అయిన డాక్టర్ భాస్కరన్ (పశుపతి) తన మనవడి చికిత్స కోసం తన పెన్షన్ డబ్బు కోసం ఎదురుచూస్తుంటాడు. తన పెన్షన్ డబ్బు పూర్తిగా రావాలంటే.. అందుకు ఎలాంటి చట్టపరమైన సమస్యలలో చిక్కుకోకూడదు అనే రూల్ ఉంటుంది. కానీ అతడు అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకుంటాడు. డీఎస్పీ దగ్గర డ్రైవర్ గా పనిచేసే గౌతమ్ (విదర్త్) తన గత తప్పుల నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తాడు. వారిద్దరి ప్రయాణం, అందులో జరిగే ఊహించని సంఘటనలే ఈ సినిమా. దాదాపు 7 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సెల్వమణి మునియప్పన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పసుపతి, విధర్త్, లక్ష్మి, లిజ్జీ ఆంటోనీ కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 55 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా.. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్..
ఒక అపరాధ భావన వ్యక్తిని ఎలా వేధిస్తుందనేది ఈ సిరీస్. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠ, ట్విస్టులతో సాగుతుంది. ఊహించని సంఘటనలు.. ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : 11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. అయినా రూ.200 కోట్ల ఆస్తులు.. గ్లామర్ పాటలతోనే ఫేమస్..
ఇవి కూడా చదవండి : Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..




